19 ఏళ్ల క్రితం ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు అదే యాక్టర్ కి తల్లిగా రమ్య కృష్ణన్.! ఆ హీరో ఎవరంటే.?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇప్పటికే వీళ్లిద్దరి చిత్రంలో అతడు ,ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.. కాబట్టి రాబోయే ఈ మూడవ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అయింది.

ramya krishnan to act as mother to hero

ఈ చిత్రంలో మహేష్ బాబు తల్లిగా ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నారు. ఆమె మరెవరో కాదు…రమ్యకృష్ణ. ఒకప్పుడు అందరు స్టార్ హీరోల సరసన అగ్ర హీరోయిన్గా నటించిన రమ్యకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక హీరోలకు తల్లిగా,అత్తగా కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ మహేష్ బాబు కి తల్లి క్యారెక్టర్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అని అనుకుంటున్నారా.. అయితే మీకు ఈ విషయం కచ్చితంగా తెలిసి ఉండదు.

Ads

ramya krishnan to act as mother to hero

2004 లో వచ్చిన మహేష్ బాబు మూవీ నాని మీకు గుర్తుందా. ఇందులో అటు చిన్నపిల్లాడిగా ఇటు 8 ఏళ్లకే 28 ఏళ్ల వ్యక్తిగా మారిన యువకుడిగా మహేష్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ మహేష్ బాబుతో ఓ మంచి రొమాంటిక్ సాంగ్లో నటించిన అన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ పాట అసలు సినిమాలో యాడ్ అవ్వలేదు.

ramya krishnan to act as mother to hero

వాస్తవానికి రమ్యకృష్ణ ,మహేష్ మధ్యలో ఒక సాంగ్ ని నాని మూవీ కోసం చిత్రీకరించడం జరిగింది. అయితే కొన్ని కారణాల కారణంగా చివరి స్క్రీనింగ్ వర్షన్ కి ఈ పాటను జోడించలేదు. అయితే ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో బాగా సందడి చేస్తోంది. ఇప్పుడు 19 సంవత్సరాల తరువాత తిరిగి రమ్యకృష్ణ గుంటూరు కారంలో మహేష్ బాబుతో నటిస్తోంది ..కానీ తల్లి పాత్రలో. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆ పాత పాటను వైరల్ చేస్తూ తమకు తోచిన కామెంట్స్ పెట్టుకుంటున్నారు.

Previous articleCA చదివి… ఇలాంటి వ్యాపారం చేయడం ఏంటి అన్నారు..! కానీ కట్ చేస్తే..? అసలు విషయం ఏంటంటే..?
Next articleపేరుకి స్టార్ హీరో.. కానీ పదేళ్లుగా ఒక హిట్ కూడా లేదు! ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.