ఉప్పెన డైరెక్టర్ సినిమాలో…రామ్ చరణ్ కి జోడిగా నటించే ఈ హీరోయిన్ కూతురు ఎవరో తెలుసా.?

Ads

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ మూవీ వచ్చి చాలా కాలం అవుతున్న ఇంకా అటు రామ్ చరణ్ నుంచి ఇటు ఎన్టీఆర్ నుంచి సాలిడ్ సోలో చిత్రాలు విడుదల కాలేదు. ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో ఇద్దరి సినిమాలు వరుసగా విడుదలై ప్రేక్షకులకు కనులు విందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ అప్ లో ఉన్న రామ్ చరణ్.. బుచ్చిబాబు కాంబినేషన్లో చేస్తున్న RC16 చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వైరల్ అయింది. ఇప్పటికే శంకర్ డైరెక్షన్లో వస్తున్న రాంచరణ్ 15 వ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా లో చేకర్లు కొడుతోంది.

Ads

ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ నటి రవీనా టాండన్…తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న నటి.. అయితే ప్రస్తుతం ఈమె సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. త్వరలో ఆమె కూతురు రాషా థడానీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

ఆల్రెడీ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కు రాషా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె టాలీవుడ్ లో రామ్ చరణ్ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి క్యూట్ గా ఉండే రాషా ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె బ్యూటీ కి ఫిదా అయిన నటిజన్ లు ఆమె రామ్ చరణ్ కి జోడిగా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Previous article“స్కంద” లో హీరో చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఈ 10 రియల్ లైఫ్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
Next articleవిగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.