EAGLE REVIEW : “రవితేజ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం: ఈగల్
  • నటీనటులు: రవితేజ, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్.
  • దర్శకుడు: కార్తీక్ గట్టమ్నేని
  • సంగీతం: దావ్జాండ్ (డేవిడ్ సందీప్)
  • నిర్మాత : T.G విశ్వ ప్రసాద్
  • రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 9, 2024

eagle review

కథ:

తలకోన అడవుల్లో కొంత మంది జనాలకి అండగా నిలిచిన వ్యక్తి సహదేవ్ వర్మ (రవితేజ). అక్కడ సహదేవ్ వర్మ ఒక కాటన్ మిల్ నడుపుతూ ఉంటాడు. అతనికి ఏదో గతం ఉంటుంది. కానీ దాని గురించి ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో, ఒక జర్నలిస్ట్ చేస్తున్న ఒక ఆపరేషన్ లో భాగంగా సహదేవ్ వర్మ గతం బయటికి వస్తుంది.

eagle review

ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా సహదేవ్ వర్మ గాలింపులో ఉంటాడు. కానీ 10 సంవత్సరాల నుండి ఎవరికి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. అసలు ఎవరు ఈ సహదేవ్ వర్మ? పోలాండ్ లో ఏం చేసేవాడు? ఇక్కడ అడవిలో ఎందుకు ఉంటున్నాడు? అతని గతం బయటికి వస్తుందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

eagle review

విశ్లేషణ:

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో రవితేజ ముందు వరుసలో ఉంటారు. ఇటీవల రవితేజ నటించిన సినిమాలు అన్ని కూడా దాదాపు కొత్త దర్శకులతో తీసిన సినిమాలే. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వంశీ అనే దర్శకుడికి అవకాశం ఇచ్చారు. అయితే వంశీ అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. అలా ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ ని రవితేజ ప్రోత్సహిస్తూ ఉంటారు. సూర్య వర్సెస్ సూర్య సినిమా ద్వారా డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

eagle review

కార్తీక్ ఒక సినిమాటోగ్రాఫర్. రవితేజ నటించిన ధమాకా సినిమాకి కూడా కార్తీక్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో రవితేజ హీరోగా దర్శకత్వం వహించారు. ఇంక కథ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా రవితేజ చాలా తక్కువగా కనిపిస్తారు. రవితేజ పాత్ర గురించి ఇతరులు ఇచ్చే ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో రవితేజ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది.

eagle review

ఇది కొంత వరకు బాగానే ఉన్నా కూడా, కొంత వరకు సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, ప్రతి వాళ్లు రవితేజ పాత్ర అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్తూ ఉంటే అదే రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో రవితేజ ప్రేమకథ, అసలు రవితేజకి ఎవరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి అనే విషయాలు చూపిస్తారు. సినిమా టేకింగ్ పరంగా స్టైలిష్ గా ఉంది. కానీ హీరో పాత్రని ఎలివేట్ చేయడానికి వాడుకున్న విధానం కొత్తగా ఉంది.

Ads

eagle review

నేరేషన్ స్టైల్ అందరికీ అంత తొందరగా ఎక్కే అవకాశం తక్కువగా ఉంది. క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ గా ఉన్న ఒక కారణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా బాగానే చేశారు. రవితేజ పాత్ర కొత్తగా ఉంది. ఆయన పాత్ర రూపొందించిన విధానం కూడా బాగుంది. రవితేజ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేశారు. డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.

eagle review

అయితే సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది అని కూడా చెప్పారు. ఒకవేళ సెకండ్ పార్ట్ ఉంటే మాత్రం ఈ పార్ట్ లో అయిన తప్పులు అందులో జరగకుండా చూసుకుంటే సినిమా వేరేగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా చోట్ల సీన్స్ ఎంగేజింగ్ గా అనిపించవు. ఇంకా బాగా తీయొచ్చు ఏమో అనిపిస్తుంది. దర్శకుడు కొత్త పద్ధతిని ఎంచుకునే ఆలోచన మంచిదే. కాకపోతే ఇంకా కొంచెం ఆసక్తికరంగా సీన్స్ రాసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

eagle review

సినిమాకి ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు. వాళ్లలో ఒకరు డైరెక్టర్ కార్తీక్ కాగా, ఇంకొక ఇద్దరు కర్మ్ చావ్లా, కమిల్ ప్లోకీ. సినిమాటోగ్రఫీ బాగుంది. అంతే కాకుండా దేవ్జాండ్ అందించిన సంగీతం కూడా బాగుంది. ఈమధ్య ఒకటే రకమైన పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ విని విని అలవాటు అవ్వడంతో, ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో ఉన్న చాలా సాధారణమైన సీన్స్ ని కూడా ఎలివేట్ చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ గా సినిమా హై క్వాలిటీలో ఉంది. కానీ కథనం విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • రవితేజ పాత్రని రూపొందించిన విధానం
  • స్టైలిష్ యాక్షన్ సీన్స్
  • నిర్మాణ విలువలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
  • డిఫరెంట్ స్టైల్ ఉన్న స్క్రీన్ ప్లే తో రూపొందించిన కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్:

3/5

ఫైనల్ గా:

సినిమాలో కథనం తప్పించి మిగిలినది అంతా కూడా చాలా హై క్వాలిటీలో అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ప్రయత్నం. కాబట్టి కొన్ని చోట్ల బోరింగ్ గా ఉన్నా పర్వాలేదు కానీ, టేకింగ్ పరంగా ఎలా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకునే వారికి, రవితేజ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి ఈగల్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!

Previous articleబుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన 5 గురు హీరోయిన్లు..
Next articleLAL SALAAM REVIEW : సూపర్ స్టార్ “రజినీకాంత్” తన కూతురి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!