Ads
ఈమధ్య కాలంలో కొందరు సిని సెలెబ్రెటీలు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి ధైర్యంగా చెబుతున్నారు. ఆ జాబితాలో తాజాగా రేణు దేశాయ్ చేరారు. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా కనిపించే ఆమె తనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
రేణు దేశాయ్ ఎమోషనల్ నోట్ షేర్ చేసి అందులో వివరణ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఈ సమయంలోనే ఎందుకు బయటపెడుతున్నాను అనేది కూడా క్లారిటీగా చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఆమె ప్రస్తుతం పూణేలో ఉంటున్నారు. రేణు దేశాయ్ కుమారుడు మరియు కూతురుతో కలిసి ఉంటున్నారు. ఆమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా ఆడియెన్స్ ముందుకు వస్తారు. ఇప్పుడు రేణు దేశాయ్ మళ్ళీ నటించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం నటిగా కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రేణు దేశాయ్ ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లల గురించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ, వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. కానీ ఆమె ఈసారి చేసిన పోస్ట్ లో ఎవరు ఊహించని విధంగా కొన్ని అనారోగ్య సమస్యలతో తాను ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ పోస్ట్ లో ఆమె కొంచెం కూడా నిరాశ పడకుండా స్ఫూర్తినిచ్చేలా రాసుకొచ్చారు.
నేను కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నాకు సన్నిహితులైన వారందరికి తెలుసని, అయితే వాటిని కొన్నిసార్లు అర్థం చేసుకొవడం చాలా కష్టమని ఎమోషనల్ గా చెప్పారు.అయితే దీనిని ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే నా కన్నా ఎక్కువగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి గుర్తు చేయడం కోసమే ఇలా చెప్తున్నాను.
Ads
మనపై మనం విశ్వాసాన్ని ఉంచుకుని, బలంగా ఉండాలి. నిరాశ చెందకుండా, నవ్వుతూ ఉండాలి అని తెలిపింది. అంతేకాకుండా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పింది. మందులు, పోషకాహారం తీసుకుంటూ యోగా మొదలైనవి కొనసాగిస్తున్నాను. నేను మళ్ళీ సాధారణ లైఫ్ కి తిరిగి రావాలని కోరుకుంటునట్లు, త్వరగా షూటింగ్ కి వెళ్లాలని ఆశిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. రేణు దేశాయ్ త్వరగా కోలుకోవాలని నెటిజెన్లు,ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అల్లరి నరేష్ భార్య ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..?