2014 నుండి వరల్డ్ కప్ లో 5 సార్లు శనిలా దాపరించాడు…ఇప్పుడు ఆయన చేసిన ఈ తప్పు వల్లే ఓడిపోయాం.!

ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అహ్మాదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా, వారి స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయింది.

మూడోసారి ప్రపంచ కప్ ను అందుకోవాలనుకున్న టీమిండియా కల చేదిరిపోయింది. ఈ టోర్నీలో ఆరంభం నుండి సెమీ ఫైనల్ వరకు వరుసగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ఫైనల్ కి వెళ్ళిన భారత్‌ ఆసీస్‌ చేతిలో ఓడిపోయింది. అయితే భారత్ ఓటమికి గల కారణాలలో ఒక అంపైర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికి ముఖ్యమైన కారణం టాస్‌ అని తెలుస్తోంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ చేయడం ఆ జట్టుకు కలిసొచ్చింది. పిచ్‌ మరియు వాతావరణ పరిస్థితులు ఆసీస్ ఆటగాళ్లకు అనుకూలంగా మారాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే టీమిండియా ఓటమికి ఇవే కాకుండా ఒక అంపైర్‌ సైతం కారణం అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా రిచర్డ్ కెటిల్‌బరో వ్యవహరించాడు.
ఇతన్ని భారతీయ అభిమానులు బ్యాడ్‌లక్‌ అంపైర్‌గా పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన చాలా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లన్నింటిలో భారత్ ఓటమి పాలయ్యింది. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్ లో కూడా లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్నాడు. ఎప్పటిలానే భారత జట్టుకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్నాడు. భారత బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా వేసిన 28వ ఓవర్‌ లో 5వ బాల్ ను ఆసీస్ ప్లేయర్ లబుషేన్‌ ఫ్లిక్‌ ఆడడానికి ప్రయత్నించాడు.
అయితే ఆ బంతి అతని ప్యాడ్లకు తాకింది. బుమ్రా చాలా కాన్ఫిడెంట్‌గా అవుట్ కు అప్పీల్‌ చేసినప్పటికీ, కెటిల్‌బరో ఆ బాల్ ని నాటౌట్‌ అని ప్రకటించాడు. దాంతో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుమ్రా అప్పీల్ తో రివ్యూ తీసుకున్నాడు. అందులో బంతి లెగ్‌ స్టంప్స్‌కు తాకుతుండటం వల్ల, అంపైర్స్‌ కాల్‌ కారణంగా థర్డ్‌ అంపైర్‌ కూడా నాటౌట్‌ అని ప్రకటించాల్సి వచ్చింది. అంపైర్‌ కెటిల్‌బరో అవుట్‌ గా ప్రకటించి ఉంటే, భారత్ కు 4వ వికెట్‌ వచ్చేది. ఆసీస్ పై ఒత్తిడి పెరిగి, మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేదని, ఈసారి కూడా కెటిల్‌బరో తన నిర్ణయంతో బ్యాడ్‌లక్‌ అంపైర్‌గా నిలిచాడని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: WORLD CUP2023: ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఇవే…అదే ఆస్ట్రేలియాకి ప్లస్ అయ్యింది.!

Previous articleమరీ ఇంత బలుపా..? అదే మనం అయితే నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాం.!
Next articleఔట్ కాకపోయినా “స్మిత్” రివ్యూ ఎందుకు కోరలేదు..? కోహ్లినే కారణమా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.