సిక్స్ ప్యాక్ ఫోటోతో షాకిచ్చిన హీరోయిన్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

Ads

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఇంట్లోనే ఉంటూ ఎక్సర్సైజులు చేస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తే మరికొందరికి హీరోయిన్ జిమ్ కి వెళ్లి ఇక కష్టపడుతూ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఎంత కష్టపడినా కూడా హీరోల మాదిరిగా హీరోయిన్లకు సిక్స్ ప్యాక్ రావడం అన్నది చాలా కష్టం. హీరోయిన్లు కూడా సిక్స్ ప్యాక్ కోసం కాకుండా నడుము నాజూగ్గా వయ్యా రంగా సుకుమారాంగా ఉండడానికి ఇష్టపడతారు.

కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక హీరోయిన్ మాత్రం సిక్స్ ప్యాక్ తో కనిపించే అందరికీ షాక్ ఇచ్చింది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? సిక్స్ ప్యాక్ ని చూపిస్తూ ఫేస్ ని హైడ్ చేస్తూ ఫోటో దిగిన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ మరెవరో కాదు రితికా సింగ్. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన గురు సినిమాలో లేడీ బాక్సర్‌గా నటించింది. అయితే ఈమె నటి కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు ఒక ప్రొఫెషనల్ బాక్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20 మ్యాచ్లు ఆడగా అందులో 17 మ్యాచులు గెలుపొంది మంచి విజయాలను అందుకుంది.

Ads

కాగా డైరెక్టర్ సుధా కొంగరాతన తొలి సినిమా సాలా ఖాదుస్ అనే బాక్సింగ్ స్టోరీ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నప్పుడు రితికా కనిపించిందట. వెంటనే ఆలస్యం చేయకుండా రియల్ బాక్సర్ అయిన ఆమెతోనే సినిమా తీసేసింది. ఇక ఇది హిట్ అయి, అవార్డులొచ్చేసరికి బాక్సర్ రితిక కాస్త హీరోయిన్ రితిక అయిపోయింది. ఈ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేయగా అందులో కూడా రితిక లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తర్వాత తెలుగులో నేనెవరో సినిమాలో నటించింది. తె

లుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్, ఓ సినిమాలో ఐటమ్ సాంగ్, మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక సిక్స్ ప్యాక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Previous articleబండి కొంటున్నారా.? ఎక్స్‌షోరూం (EX-SHOWROOM) ధరకి – ఆన్‌రోడ్‌ (ON ROAD) ధర కి తేడా ఏంటో తెలుసా.?
Next articleఈ ఒక్క రూపాయి కథ ఏంటో తెలుసా.? “చంద్రమోహన్” దగ్గర ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు ఒక రూపాయి తీసుకుంటారు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.