Ads
వరల్డ్ కప్ లో ఇండియా టీం ఏ రేంజ్ లో దూసుకుపోతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టేబుల్ టాపర్ గా నిలుస్తూ ప్రతి ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిట్లో సూపర్ ఫార్మ్ లో ఉంది టీం ఇండియా. ఇది ఇలా ఉంటె…ప్రపంచ కప్ ముగిసిన నాలుగు రోజులకే టీం ఇండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో తలపడనుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సిరీస్ లో స్వదేశంలో ఐదు మ్యాచ్ లు ఆడనుంది భారత్. ఈ సిరీస్ కోసం టీం ఇండియా త్వరలోనే జట్టును ఎంపిక చేయనుంది.
ఈ క్రమంలో యువ క్రికెటర్ రియాన్ పరాగ్, రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం జాతీయ జట్టుకు తన తొలి కాల్ ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం సీనియర్ లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటిన ఆటగాలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.
Ads
ఏడు అర్ధ శతకాలు సాధించిన రియాన్ టి20 లో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్ గారికార్డ్ సృష్టించాడు. పది మ్యాచ్ లు ఆడగా 500 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అలాగే బంతితో 11 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అంతకుముందు జరిగిన దేవధర్ ట్రోఫీ లో సత్తా చాటిన రియాన్ ఐదు మ్యాచ్ లలో 354 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.అందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ రియాన్ పరాగ్ ను జట్టిలోకి తీసుకోవచ్చు అని తెలుస్తుంది.
ఐపీఎల్ లో రియాన్ పరాగ్…తన ఆట కంటే కూడా తన చేష్టలతో ఎక్కువ వార్తల్లో నిలిచేవాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా వినూత్నమైన షాట్స్ ఆడడం అతని ప్రత్యేకత. ఇప్పటికే రియాన్ కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు మరియు రాజస్థాన్ రాయల్స్ లైనప్‌లో టాప్ ఆటగాడిగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ మరియు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో సహా పలు దేశీయ టోర్నమెంట్లలో అస్సాంకు ప్రాతినిధ్యం వహించాడు. ఆట బాగానే ఉన్నా…అతను ఫీల్డ్ మీద ఓవరాక్షన్ చేయడం వల్ల…టీం ఇండియాలోకి ఈ ఓవరాక్షన్ స్టార్ అవసరమా..? టీం ఇండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.