Ads
ఒకప్పుడు తెలుగు ఆడియెన్స్ తెలుగు చిత్రాల తరువాత హిందీ, తమిళ చిత్రాలను, అప్పుడప్పుడూ మలయాళ చిత్రాలను చూసేవారు. కానీ కన్నడ చిత్రాలను అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ కేజీఎఫ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా భారతీయ ప్రేక్షకులు కన్నడ సినిమాల వైపు దృష్టి పెట్టారు.
2018 లో కేజీఎఫ్-1 మూవీ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సాధించింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్. కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2018లో డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఆ సమయంలో ఒక ఊపు ఊపేసింది. ఈ మూవీతో మాస్, హీరోయిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించి కమర్షియల్ మూవీ అర్థాన్ని మార్చారని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో రాఖీభాయ్ గా యశ్ జీవించాడు. విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. రాఖీ భాయ్ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రాఖీభాయ్ చాలామందిని చంపుతాడు. ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లో మొత్తం పదిహేడు మందిని చంపుతాడు. ఆ తరువాత కేజీఎఫ్ లో ఎంట్రీ సన్నివేశంలో ఒక గ్యాంగ్ మొత్తాన్ని అంటే అందులోని ముప్పై రెండు మందిని చంపుతాడు. అక్కడి నుండి కొంచెం లోపలికి వెళ్ళి, అక్కడ ఉన్న పదకొండు మందిని కూడా హతమారుస్తాడు.
ఆ తరువాత మైన్స్ లో పనిచేసే ఒక తాతను కాపాడడం కోసం అక్కడ పనిచేసే ఇరవై మూడు మంది గార్డ్ లను చంపేస్తాడు. ఆ తరువాత సినిమా క్లైమాక్స్ లో మెయిన్ విలన్ గరుడను చంపుతాడు. ఇలా సినిమాలో మొత్తం రాఖీభాయ్ 94 మందిని చంపుతాడు.
Ads
Also Read : ప్రియాంక మోహన్ ఇలా బొద్దుగా మారడానికి కారణం ఆ హీరో అంట.. ఎందుకంటే..?