విరూపాక్ష సీక్వెల్…కానీ ట్విస్ట్ ఏంటంటే.? హీరో సాయి ధరమ్ తేజ్ కాదు.! మరి ఎవరు?

Ads

ఈ సంవత్సరం సైలెంట్ గా వచ్చి బయ్యర్లకు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన మూవీ విరూపాక్ష. సాయి ధరమ్ తేజ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. పైగా అతను ఏక్సిడెంట్ నుంచి రికవరీ అయిన తర్వాత చేసిన మొదటి చిత్రం కూడా ఇదే.హారర్ జానర్ లో మంత్రాలు చేతబడుల బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే చాలా మూవీస్ వచ్చి ఉండొచ్చు..కానీ ‘విరూపాక్ష’ మాత్రం కాస్త వీటికి భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు.

ఈ మూవీలో సస్పెన్స్ మెయింటెనెన్స్ అద్భుతంగా ఉంది. శాసనాల గ్రంధం ను అడ్డుపెట్టుకొని విలన్ మొత్తం కథ నడిపిస్తున్న విషయం అర్థం చేసుకోవడానికి క్లైమాక్స్ వరకు సమయం పడుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో గ్రిప్పింగా ,తర్వాత ఏం జరుగుతుంది అనే ఎక్సైట్మెంట్ తో సాగే మూవీ ఇది. అప్పటివరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కార్తీక్ దండు ఈ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

Ads

మొదటి సినిమా తోటి యూత్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా తీయాలి అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందరూ ఊహించినట్టు ఈ సీక్వెల్ మూవీలో హీరో సాయిధరమ్ తేజ కాదట. సీక్వెల్ ప్రారంభం ఎప్పుడు అనే విషయం ఇంకా కన్ఫామ్ కాలేదు కానీ హీరో ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చేలా ఉంది.

ఈ సీక్వెల్ సాయి ధరమ్ తేజ చేయడం లేదు.. స్వాతి ఈ మూవీ అక్కినేని హీరో అఖిల్ తో చేయించాలి అనుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే ఈ విషయంపై కార్తిక్ అఖిల్ ని కలిసి స్టోరీ ఎక్స్ప్లైన్ చేయడం, స్టోరీ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. ఇప్పటికే ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న అఖిల్ ఖాతాలో ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు.

మొదటి పార్ట్ సక్సెస్ అయ్యింది,రెండవ పార్టు స్క్రిప్ట్ బాగుంది .కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ ద్వారా అయినా హిట్ అందుకుంటాను అన్న ఆశతో అఖిల్ ఈ మూవీకి ఓకే చెప్పాడేమో. మొత్తానికి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక అప్పటికైనా మూవీలో హీరో ఎవరు అనే విషయంపై మేకర్ స్పష్టత ఇస్తారేమో చూడాలి.

 

Previous article“జై శ్రీరామ్” అంటే తప్పేంటి…అప్పుడు మన ప్లేయర్స్ మీద రాళ్లు వేసింది మరిచిపోయారా.?
Next articleసీరియల్ లో సంప్రదాయంగా కనిపించే “త్రినయని”…ఇంత స్టైలిష్ గా ఉంటుందా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.