Ads
సాధారణంగా రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటేనే కాంపిటీషన్ గట్టిగా ఉన్నట్టు లెక్క. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి వస్తున్నాయి అంటే కాంపిటీషన్ ఇంకా గట్టిగా ఉంది అని అర్థం. ఈ నెల అలాంటిదే. ఆ సినిమాలు ఏవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కొంత మంది బాగుంది అంటే, మరి కొంత మంది రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది అని అంటున్నారు. అయితే మరొక పక్క బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా కూడా అదే టైంకి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు.
అయితే సినిమాకి సంబంధించి అంతకుముందు విడుదల చేసిన టీజర్, పాటల్లో షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక గెటప్ మాత్రమే ఇందులో చూపించారు. ఇప్పుడు ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ ముసలివాడిగా కనిపిస్తారు అని కూడా చూపించారు. ఈ సినిమాలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తున్నారు. హీరో విక్కీ కౌశల్ కూడా మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలి అని కలలు కనడం, ఇంగ్లీష్ రాక వాళ్ళు పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
అంతే కాకుండా, విక్కీ కౌశల్ పాత్ర సినిమా మొత్తం కూడా ఉండరు అని తెలుస్తోంది. ఈ పాత్ర కారణంగానే మిగిలిన ముఖ్య పాత్రలు ఫారిన్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు అని ట్రైలర్ లో చూపించారు. అయితే మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే. అయితే సినిమా ట్రైలర్ వచ్చే ముందు చాలా సందేహాలు ఉన్నాయి. సలార్ ట్రైలర్ ముందు డంకీ ట్రైలర్ నిలవదు అని అన్నారు. కానీ పోల్చి చూస్తే సలార్ కంటే ఈ సినిమా ట్రైలర్ కొత్తగా అనిపిస్తోంది. సలార్ అనేది ఒక కమర్షియల్ సినిమా.
Ads
ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ ఉంటాయి. ఒక సమయంలో ఇలాంటి ఎలివేషన్స్ ని మనవాళ్లు బాగా ఇష్టపడ్డారు. కానీ ఒక పాయింట్ తర్వాత అవి మరీ అతిగా అనిపించడంతో ఎలివేషన్స్ కాస్త ట్రోలింగ్ మెటీరియల్ అవుతున్నాయి. ఈ సినిమా అలా అవ్వకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఇంక డంకీ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎలివేషన్స్ తక్కువ. సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన ప్రతి సినిమాలో స్టార్ హీరోలని తీసుకుంటారు.
కానీ ఏ సినిమాలో కూడా వాళ్ళని స్టార్ లాగా కాకుండా వాళ్ళకి ఒక మంచి పాత్ర ఇచ్చి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేలాగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా ఒక్కచోట కూడా షారుఖ్ ఖాన్ అని చెప్పి ఎలివేషన్ ఇవ్వడం లాంటివి చేయలేదు. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఇది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ట్రైలర్ లో చూపించిన కంటెంట్ పరంగా పోల్చి చూస్తే మాత్రం డంకీ ఈ విషయంలో కాస్త ముందే ఉంది.
Salaar trailer :
అంతే కాకుండా సినిమా బృందం ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసింది. డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3 పేర్లతో ఈ సినిమా టీజర్, రెండు పాటలు విడుదల చేశారు. ఇంక సలార్ విషయానికి వస్తే ట్రైలర్ తప్ప ఏమీ విడుదల అవ్వలేదు. ఆ టైలర్ మీద కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా కూడా డంకీ వర్సెస్ సలార్ కాకుండా, డంకీ అండ్ సలార్ అయ్యి రెండు సినిమాలు హిట్ అయితే, రెండు సినిమాలకి బాగా కలెక్షన్స్ వస్తే భారతీయ సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.
Dunki trailer :
ALSO READ : 30 ఏళ్ల యంగ్ హీరోకి అక్కగా నయనతార..! ప్రేక్షకులు అంగీకరిస్తారా..?