Ads
సాధారణంగా సీరియల్స్ లో కామెడీ సీరియల్స్ ఉండడం వేరు. కానీ ఈ మధ్య ప్రతి సీరియల్ కామెడీ అయిపోయింది. ఇది అందరూ అనుకుంటున్న మాట. సీరియల్ లో వాళ్ళు చాలా సీరియస్ గా చేసే కొన్ని పనులు చూడడానికి కామెడీగా అనిపిస్తాయి. ఇటీవల అలాంటి సీరియల్స్ చాలా వచ్చాయి.
సీరియల్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి సినిమాల్లో పాటలని వాడుతారు. అవి ఎక్కువగా తెలుగు సీరియల్స్ లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. బాహుబలి సినిమా మ్యూజిక్ ని తీసుకొచ్చి సీరియల్ లో ఏదో మామూలు సీన్ కి పెడతారు.
ఒకొక్కసారి అలాంటివి చూస్తూ ఉంటే, “అంత మంచి మ్యూజిక్ ని ఇలా ఎందుకు ఉపయోగించారు?” అని కూడా అనిపిస్తుంది. కొన్ని సీరియల్స్ లో ఇంకా వింత వింత సీన్లు జరుగుతూ ఉంటాయి. ఏ కొత్త సినిమా వస్తే, ఆ కొత్త సినిమా స్టోరీ లైన్ తీసుకొని సీన్స్ రాయడం వంటివి చేస్తున్నారు. పోనీ అవి చూడడానికి ఏమైనా సినిమాల్లో చూపించినంత ఎమోషనల్ గా ఉంటాయా అంటే అలా కూడా ఉండవు. అలా ఇటీవల ఒక సీరియల్ మీద కామెంట్స్ వస్తున్నాయి.
మా టీవీలో ప్రసారం అయ్యే నువ్వు నేను ప్రేమ సీరియల్ మంచి రేటింగ్ తో నడుస్తోంది. హిందీలో ప్రసారం అయిన ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ సీరియల్ కి రీమేక్ గా ఇది రూపొందుతోంది. ఆ సీరియల్ కొంత కాలం క్రితం తెలుగులో డబ్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే సీరియల్ ని రీమేక్ చేశారు. ఇటీవల అలాంటి సీరియల్స్ చాలానే వస్తున్నాయి. గతంలో డబ్ చేసి విడుదల చేసిన సీరియల్స్ ని ఇప్పుడు రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు.
Ads
ఒరిజినల్ స్టోరీ ని ఒరిజినల్ స్టోరీ లాగా ఉంచకుండా, అందులో మార్పులు చేస్తున్నారు. కొన్ని మార్పులు అయితే అసలు సీరియల్ స్టోరీ లైన్ ని మార్చేసే లాగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ లో హీరో ఇటీవల యానిమల్ సినిమాలో హీరో చేసిన ఒక సీన్ ని చేస్తూ కనిపించాడు. యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్, తన తండ్రితో క్లైమాక్స్ లో పాత్రలు మార్చుకునే సీన్ ఒకటి చేస్తాడు.
అనిల్ కపూర్ కి తనని, “నాన్న, నాన్న” అని పిలవమని చెప్పి, ఒక పాయింట్ తర్వాత రణబీర్ కపూర్ అనిల్ కపూర్ మీద అరుస్తాడు. అంతకుముందు రణబీర్ కపూర్ చిన్నగా ఉన్నప్పుడు అనిల్ కపూర్ అలాగే రియాక్ట్ అయ్యేవారు అని చెప్పి ఆ సీన్ లో చేసి చూపిస్తాడు. “వినిపిస్తోంది. నాకేమీ చెముడు లేదు” అని రణబీర్ కపూర్ అంటాడు. ఇప్పుడు ఇదే సీన్ ని డైలాగ్స్ తో సహా సీరియల్ లో చేశారు. సినిమాలో ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాకి హైలైట్ అయిన ఒక సీన్ ఇది.
అంత సీరియస్ గా రాసుకున్న సీన్ ని సీరియల్ లో పెట్టడానికి కారణం ఏంటో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ సీన్ మీద కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ సీరియల్ సీన్ చూస్తూ ఉంటే అదేదో ఎమోషనల్ సీన్ అని అర్థం అవుతోంది. కానీ, “ఎలాంటి సీన్ కోసం అయినా సరే సినిమా సీన్ ఉపయోగించకుండా ఉండాల్సింది” అని అంటున్నారు. “దాని కారణంగా సినిమాతో పోలికలు వచ్చి కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి” అని అంటున్నారు.
watch video :
Yentamma idi 😭😭😭🙏🏻
Low Budget Animal Serial for family audience @imvangasandeep pic.twitter.com/kq1AjnRQ4x— Sandhya Reddy YSCRP 🇺🇿 (@SandhyaSamayam) March 8, 2024
ALSO READ : సలార్ పార్ట్-2 లో హీరోలకి గొడవ అవ్వడానికి ఈ “మ్యాథ్స్ ప్రాబ్లం” కారణమా..? ఈ టీచర్ చెప్పిన లెక్క చూశారా..?