Ads
చాలా సినిమాలను థియేటర్ లో ఉన్నప్పుడు మనం పట్టించుకోము. అసలు అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయి కూడా తెలియదు. కానీ అవి ఓటిటి లోకి వచ్చిన తర్వాత వాటిని చూసి అరే ఇది థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అవుతాము.
థియేటర్ లో ఫెయిల్ అయినవి ఓటిటి లో సక్సెస్ అవుతాయి. తాజాగా ఎలాంటి ఒక సినిమా ఇదే ఫీటును సాధించింది. ఇంతకీ అది ఏ సినిమా? అందులో నటించింది ఎవరు? అనే వివరాలు చూద్దాం…!
సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రమే అన్నపూరణి. ఈ మూవీ థియేటర్ లో విడుదలైనా కూడా అప్పట్లో వచ్చిన వరదల కారణంగా ఎవరూ పట్టించుకోలేదు.
అయితే థియేటర్లలో నుండి బయటకు వచ్చేసాక ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాకి అపూర్వస్పందన లభిస్తుంది.
అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడులోనీ శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ (అచ్యుత్ కుమార్) చెఫ్. అయితే ఆయన కూతురు అన్నపూరణి (నయనతార) ఆయనను చూస్తూ చిన్నప్పటినుండి చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె చెఫ్ అయ్యి మాంసాహారాలను ముట్టుకోవడానికి తండ్రి ఒప్పుకోడు.
Ads
మరి చిన్నప్పటినుండి చెఫ్ అవ్వాలనుకుంటున్న అన్నపూరణి అనుకున్నది సాధించిందా? లేదా?అనే విషయం తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే. అయితే సినిమా విడుదల అయ్యాక కొన్ని సీన్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సీన్స్ వివాదాత్మకంగా ఉన్నాయి అన్నారు. సినిమాలో హీరోయిన్ శాకాహారి. అయితే ఆమె హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటున్న క్రమంలో కోడిని కట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నాన్ వెజ్ కూడా వండాల్సిన పరిస్థితి రావడంతో ఒక సమయంలో నాన్ వెజ్ తిన్నట్టు చూపిస్తారు.
దాంతో ఇలాంటి విషయాల మీద సినిమా ఎలా తీశారు అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. దాంతో వాటన్నిటికీ ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి ఇచ్చేశారు. దాంతో సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా టేకింగ్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అందుకే సినిమా కాన్సెప్ట్ కంటే వివాదాలకే ఎక్కువ ఫేమస్ అయ్యింది.