Ads
సినీ పరిశ్రమలో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తారు. నటీనటులకు, ప్రొడ్యూసర్లకు మధ్య వారధిలా మేనేజర్లు పని చేస్తుంటారు. హీరో హీరోయిన్ల డేట్స్ నుండి మొదలుపెడితే వారు తీసుకునే రెమ్యూనరేషన్ వరకు అన్ని విషయాలు మేనేజర్లు చూసుకుంటారు. నటీనటులు వారి మేనేజర్లు చెప్పినదాన్ని పాటిస్తూ ఉంటారు.
Ads
అందువల్లే దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్ల మేనేజర్ల వెంట పడుతుంటారు. వారి హీరోతో లేదా హీరోయిన్ తో తమ మూవీ సెట్ చేసుకోవడం కోసం రిక్వెస్ట్ చేస్తుంటారు. స్టార్ హీరోహీరోయిన్లు నమ్మకస్తులను మాత్రమే మేనేజర్లుగా పెట్టుకుంటారు. వారి శాలరీ కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ మేనేజర్ శాలరీ విషయం వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. షారుక్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ తాజాగా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. రెండు రోజులకు గాను 214.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించి, అతి తక్కువ టైమ్ లో 200 కోట్ల క్లబ్‍లో చేరిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్ మేనేజర్ శాలరీ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. షారుక్ మేనేజర్ పేరు పూజా దద్లానీ. ఆమె 2012 నుంచి షారుఖ్‌కు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. షారుఖ్ కు సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయాలలో పూజా సలహాలు ఇస్తుంటారని తెలుస్తోంది. పదేళ్లకు పైగా షారుఖ్‌తో పనిచేయడం వల్ల వారి కుటుంబంతో పూజాకు మంచి అనుబంధం ఉంది. షారుఖ్ వైఫ్ గౌరీఖాన్ పూజాను సొంతవారిలానే చూసుకుంటుందట.
షారుఖ్ సంపాదన గురించి తెలిసిందే. వరల్డ్ లోనే అత్యంత ధనికులైన హీరోల్లో షారూఖ్ ఒకరు. తమ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసుకునే పూజాకు షారుఖ్ శాలరీ కూడా భారీగానే ఇస్తున్నాడంట. పూజా దద్లానీ వేతనం సంవత్సరానికి రూ.7 కోట్ల నుండి 9 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఆమె కేవలం మేనేజర్‌గా మాత్రమే కాకుండా వేరే బిజినెస్ లు కూడా చేస్తుంటారట. ఆమె సంపాదన విలువ సుమారు రూ.50 కోట్లు అని తెలుస్తోంది.
Also Read: 43 ఏళ్లు వచ్చినా…. ఒకప్పటి హీరోయిన్ “కౌసల్య” ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?