Ads
శర్వానంద్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా మనమే. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి శర్వానంద్, కృతి శెట్టికి ఈ సినిమాతో హిట్ పడిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : మనమే
- నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్.
- నిర్మాత : T.G విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి
- సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
- విడుదల తేదీ : జూన్ 7, 2024
స్టోరీ :
విక్రమ్ (శర్వానంద్) లండన్ లో ఉంటాడు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ సరదాగా గడిపేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అనురాగ్ (త్రిగున్) విక్రమ్ ఫ్రెండ్. అనురాగ్, శ్వేత (మౌనిక) అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ ఖుషి (విక్రమ్ ఆదిత్య) పుడతాడు. ఇండియాకి వచ్చిన తర్వాత జరిగిన ఒక ప్రమాదంలో అనురాగ్, శ్వేత చనిపోతారు. దాంతో ఖుషి బాధ్యత ఎవరు చూసుకుంటారు అనే విషయం వస్తుంది. అనురాగ్ అనాధ. శ్వేత వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది కాబట్టి, శ్వేత తల్లిదండ్రులు బాబుని అంగీకరించరు.
దాంతో, శ్వేత ఫ్రెండ్ సుభద్ర (కృతి శెట్టి) బాబుని చూసుకోవాలి అని అనుకుంటుంది. మరొక పక్క కొన్ని కారణాల వల్ల విక్రమ్ కూడా బాబు బాధ్యతలు తీసుకోవాలి అని అనుకుంటాడు. ఖుషికి ఇంగ్లాండ్ సిటిజన్ షిప్ ఉంటుంది. వాళ్ల నియమాల ప్రకారం తల్లిదండ్రులు లాగా నాలుగు నెలల పాటు కేర్ టేకర్స్ చూసుకోవాలి. లేదు అంటే బాబుని అనాధాశ్రమంలో చేర్చుతారు. అందుకే విక్రమ్, సుభద్ర కలిసి బాబుని చూసుకుంటూ ఉంటారు. మరొక పక్క సుభద్రకి కార్తీక్ (శివ కందుకూరి) తో నిశ్చితార్థం జరుగుతుంది. విక్రమ్, సుభద్ర బాబుని ఎలా జాగ్రత్తగా చూసుకున్నారు? వాళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? ఈ క్రమంలో విక్రమ్ ఎలా మారాడు? వీళ్లు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తక్కువగానే వచ్చాయి. కానీ కథ తెలుస్తూ ఉంటుంది. చివరికి హీరో, హీరోయిన్ కలుస్తారు అనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ వాళ్లు మధ్యలో ఎదుర్కొన్న సంఘటనలు ఎలా ఉంటాయి అనే ఆసక్తితోనే సినిమా అంతా చూస్తారు. డైరెక్టర్ ప్రయత్నానికి మెచ్చుకోవాలి. శ్రీరామ్ ఆదిత్య ఎంచుకున్న ఈ స్టోరీ పాయింట్ లో నిజాయితీ కనిపిస్తోంది. కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయి. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా చాలా పొరపాట్లు జరిగాయి. ఫస్ట్ హాఫ్ అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇలాంటి సినిమాలకి సెకండ్ హాఫ్ చాలా ముఖ్యమైనది. కానీ అక్కడే సీన్స్ ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.
Ads
కానీ సెకండ్ హాఫ్ లో చూపించిన ఎమోషన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శర్వానంద్ ఈ సినిమాలో చూడడానికి బాగున్నారు. బాగా నటించారు. శర్వానంద్ కాస్ట్యూమ్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. శర్వానంద్ నటన గురించి కానీ, ఎక్స్ప్రెషన్స్ గురించి కానీ ఈ సినిమా పరంగా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అంత బాగా చేశారు. సినిమా మీద ప్రమోషన్స్ సమయంలో అంత నమ్మకంగా ఉంటే అర్థం కాలేదు. కానీ సినిమా చూశాక శర్వానంద్ నటన ఎంత బాగుందో ప్రేక్షకులకి అప్పుడు అర్థం అవుతుంది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. కృతి శెట్టి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
తన పాత్ర ఓవర్ గా ఎమోషన్స్ పలుకుతూ కాకుండా, చాలా బ్యాలెన్స్ ఉన్న అమ్మాయిలాగా ఉంటుంది. ఈ పాత్రలో చాలా బాగా నటించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు కానీ కొన్ని పాత్రలు రాసుకున్న విధానం, వాళ్ల సీన్స్ రాసుకున్న విధానం అంత బాగా అనిపించదు. ముఖ్యంగా రాహుల్ రవీంద్రన్ ట్రాక్ అయితే అసలు అర్థం కూడా కాదు. అది లేకపోయినా సినిమా బాగుండేది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉన్నా కూడా ఇంకా బాగుండేది అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి.
సినిమాలో 16 పాటలు ఉన్నాయి అని అన్నారు. కానీ అన్ని ఎక్కువ పాటలు ఉన్నట్టు అనిపించదు. సినిమా నడుస్తూనే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో పాటలు ప్లే అవుతూ ఉంటాయి. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ చాలా బాగా చూపించారు. సినిమాలో ఫ్రేమ్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమాకి సినిమాటోగ్రఫీ ఒక మంచి ఫీల్ యాడ్ చేసింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- కామెడీ సీన్స్
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
- ఎడిటింగ్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కథ కొత్తగా ఉంటుంది అని అనుకోకుండా, ఇలాంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మనమే సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :