Ads
నాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో నాని నటన ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఈమె మాత్రమే కాకుండా మరొక నటి శృతిహాసన్ కూడా ఒక చిన్న పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
Ads
శృతిహాసన్ పాత్ర చిన్నది అయినా ఈమె పాత్ర పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి అయితే తాజాగా శృతిహాసన్ పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శృతిహాసన్ పాత్రలో నటించడం కోసం చిత్రబృందం ముందుగా నటి రష్మిక మందన్నను సంప్రదించారట. అయితే ఈ పాత్ర విన్నటువంటి రష్మిక చాలా సున్నితంగా ఈ పాత్రను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.
ఇలాంటి చిన్న పాత్రలో నటిస్తే తన క్రేజ్ దెబ్బతింటుందని ఈమె రిజెక్ట్ చేశారట. అంతేకాకుండా ఈ పాత్ర గురించి రష్మిక తన స్నేహితుల వద్ద మాట్లాడుతూ ఈ సినిమాలో ఈ పాత్ర ఒక బిస్కెట్ పాత్ర అని ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కూడా లేదు అంటూ చాలా చీప్ గా మాట్లాడుతూ ఈ పాత్రను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా ఈమె రిజెక్ట్ చేయడంతో ఈమె స్థానంలో నటి శృతిహాసన్ ఈ పాత్రలో నటించారని అయితే ఈమె పాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ రావడం విశేషం.