ఈ విషయంలో రష్మీ, అనసూయ కంటే “సిరి హనుమంత్” చాలా బెటర్ అంటున్న నెటిజెన్స్..ఏంటంటే.?

Ads

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి గురు శుక్రవారాలలో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ షో ప్రారంభమై కొన్ని ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ సక్సెస్ఫుల్ షో గా రాణిస్తూ దూసుకుపోతోంది. జబర్దస్త్ షో తర్వాత వచ్చిన ఎన్నో షోలు ఈ షోని దాటి వెళ్లలేకపోయాయి. చాలా కామెడీ షోలు జబర్దస్త్ ని బీట్ చేయాలని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేక మౌనంగా ఉండిపోయాయి. జబర్దస్త్ షో తో పోటీ పడలేకపోయాయి. కాగా ఈ జబర్దస్త్ షో యాంకర్లను మొదలుకొని ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

చాలామంది ఈ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా కొత్త కొత్త ఆర్టిస్టులు జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ కి వేలలో నుంచి లక్షల్లో అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ షోకు మొదట యాంకర్స్ గా అనసూయ, రష్మి ఉన్న సంగతి తెలిసిందే. ఇక అనసూయ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉండటంతో జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమె ప్లేస్ లో సౌమ్య రావుని తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఇటీవల జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది.

Ads

అయితే ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చింది. అయితే సిరి రెమ్యూనరేషన్ తెలుసుకుని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రష్మి, అనసూయల కంటే డబుల్ ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది. కాగా ఇటీవల జబర్దస్త్ కొత్త యాంకర్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ బ్యూటీ సౌమ్య రావు ప్లేస్ లోకి వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిరి హనుమంత్ రెమ్యూనరేషన్ ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే సిరిహనుమంత్ జబర్దస్త్ యాంకర్ గా ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 3.50 లక్షలు ఛార్జ్ చేస్తోందని తెలుస్తోంది. నిజానికి అనసూయ, రష్మి కేవలం రూ.1.50 లక్షలు తీసుకునేవారట. అయితే సిరి హనుమంత్ మాత్రం ఏకంగా దానికి డబల్ రేంజ్ లో ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది. దానికి కారణం ఆమె కున్న క్రేజ్ అని తెలుస్తోంది. అనసూయ, రష్మీలని మించి రెమ్యూనరేషన్ తీసుకోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయంపై స్పందించిన పలువురు నెటిజన్స్ పారితోషికం విషయంలో రష్మిక అనసూయ కంటే సిరి బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleఅంత స్టార్ హీరో అయ్యుండి.. “వెంకటేష్” ఇలాంటి ఫోన్ వాడుతున్నారా..?
Next articleప్రేమించి పెళ్లి చేసుకొని…దీపావళి రోజే ఇలా…? ఇలాంటి భర్తను ఏమనాలి.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.