SJ సూర్య, నయనతార కలిసి నటించారు అని తెలుసా..? ఈ సినిమా తెలుగులో కూడా వచ్చింది..!

Ads

కొన్ని కాంబినేషన్స్ అసలు ఆలోచనకి కూడా రావు. అలాంటి కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ కాంబినేషన్స్ ఏవైనా అవుతాయి. అంటే, హీరో – డైరెక్టర్ కాంబినేషన్, హీరో – మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, హీరో – ప్రొడ్యూసర్ కాంబినేషన్, హీరో-హీరోయిన్ కాంబినేషన్, ఇలాంటివి. అలాంటి కాంబినేషన్ ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తూ, డిఫరెంట్ పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జె సూర్య.

sj suryah nayantara acted in a movie

ఒక సమయంలో ఎస్ జె సూర్య హీరోగా కూడా నటించారు. ఆయన పక్కన నయనతార హీరోయిన్ గా ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా చాలా మందికి తెలియదు. ఈ సినిమా పేరు కాల్వవనిన్ కాదలి. తెలుగులో కూడా ఈ సినిమా వచ్చింది. చిలిపి పేరుతో ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకి తమిళ్ వన్నన్ దర్శకత్వం వహించారు. లక్ష్మణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అప్పట్లో పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. శ్రద్ధ ఆర్య ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా నటించారు.

Ads

సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో కామెడీ బాగుంది అంటూ అప్పట్లో టాక్ వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. ఒకవేళ ఆ సీన్స్ లేకపోతే సినిమా అందరూ చూడదగ్గ సినిమా అని అన్నారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఇంకా బాగా తీస్తే బాగుండేది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా 2006 లో వచ్చింది. అప్పట్లో ఇంటర్నెట్ గురించి అంత పెద్ద అవగాహన ఉండదు.

టీవీలో వస్తే సినిమా చూడాలి. అలాంటి సమయంలో ఈ సినిమా వచ్చింది కాబట్టి చాలా మందికి ఈ సినిమా తెలియదు. నయనతార కూడా అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు. సినిమా పాటలు మాత్రం హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా పాటలు వినే వాళ్ళు ఉంటారు. యువన్ శంకర్ రాజా చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు అని అందరూ మెచ్చుకున్నారు.

Previous articleజనసేన పార్టీ చిహ్నంలో కేవలం ఈ రంగులు మాత్రమే ఎందుకు ఉపయోగించారు..? ఆ సింబల్ అర్థం ఏంటో తెలుసా..?
Next articleThe Greatest of All Time Review : “తలపతి విజయ్” డబల్ యాక్షన్ లో నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.