Ads
పాముల్ని చూస్తే ఎవరికైనా భయం ఉంటుంది. పాము కాటేస్తే దాని విషం మనకి చేరుతుందని.. ప్రాణానికి ప్రమాదం అని భయ పడుతూ ఉంటాము. చాలా మంది ఇళ్లల్లోకి కూడా పాములు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు పాములు పట్టే వాళ్ళని పిలిచి పాములని ఇంటి నుండి పట్టుకెళ్ళమని అంటూ ఉంటాము. అయితే కొందరు మాత్రం అస్సలు పాముని చూసి భయ పడరు.
నిజానికి పాముల్ని మనం ఏమి అనకూడదు. పాముతో చెలగాటమాడడం కూడా చాలా ప్రమాదకరం. పాములని పట్టుకోవడం ఏడిపించడం లేదంటే ఆటలాడడం అస్సలు మంచిది కాదు.
ఇంకొంతమందికి అయితే పాము అంటే చాలా భయం ఉంటుంది. పాముల మీద వుండే ఫోబియా ని ఓఫిడియో ఫోబియా అని అంటారు. మీ ఇంట్లోకి పాములు రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా..? జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలా మీరు అనుసరించడం వలన మీ ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.
పాములు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి:
Ads
#1. నిమ్మకాయలను ఇంట్లో ఉంచండి:
నిమ్మకాయలని ఇంట్లో పెట్టడం వలన పాములు రాకుండా ఉంటాయి. పూర్వకాలం నుండి గుమ్మాలకి నిమ్మకాయలు కట్టడం మనకి ఆచారం. అయితే పురాతన పద్ధతులని తేలికగా తీసేయొద్దు. నిజానికి గుమ్మానికి నిమ్మకాయలని కడితే ఆ వాసన కి పాములు ఇంట్లోకి చేరవు.
#2. ఎలుకలు లేకుండా చూసుకోండి:
ఇంట్లో ఎలుకలు లేకుండా ఉంటే పాములు ఇంట్లోకి రావు కాబట్టి ఎలుకలు లేకుండా చేసుకోవడం ముఖ్యం. మీరు మీ ఇంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, లవంగం నూనె, మిరియాల పొడి, ఎర్ర మిరపకాయ పొడి ఉంచడం వలన ఎలుకలు చేరవు.
#3. బ్లీచింగ్ పౌడర్ ని వెయ్యండి:
బ్లీచింగ్ పౌడర్ ని జల్లడం వలన కూడా ఇంట్లోకి పాములు రావు.
#4. గడ్డిని కట్ చేస్తూ ఉండండి:
గార్డెన్ ఏరియాలో గడ్డి ఎదిగిపోతూ ఉంటుంది దానిని కట్ చేస్తూ ఉండడం ముఖ్యం. దాన్ని కట్ చేస్తూ ఉండటం వలన పాములు వంటివి చేరవు.