Ads
ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీలో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి దాకా ఈ వరల్డ్ కప్ లో టీమిండియాతో ఆడి, గెలిచిన జట్టు లేదు. రోహిత్ సారధ్యంలోని భారత జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి టోర్నీలో దూసుకెళ్తోంది.
Ads
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సైతం టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా టెంబా బావుమా ఓటమి పై స్పందించాడు. అయితే తమ జట్టు ఓటమి పాలవ్వడానికి కారణం వివరించాడు.
ఈసారి ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆదివారం నాడు సౌత్ఆఫ్రికా జట్టుతో తలపడి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సఫారీ బ్యాట్స్ మెన్స్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆ జట్టును 83 రన్స్ కే ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 రన్స్ చేసింది.
విరాట్ కోహ్లీ సెంచరీతో సాధించగా, శ్రేయస్ అయ్యర్ 77, శుభ్ మన్ గిల్ 23, రోహిత్ శర్మ 40 చేశారు. ఆ తరువాత 327 పరుగుల టార్గెట్ ను చేధించడానికి బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా భారత బౌలర్ల ధాటికి 83 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రవీంద్ర జడేజా 5 వికెట్లు, షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీశారు. 243 భారీ తేడాతో టీమిండియా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది.
మ్యాచ్ అనంతరం ఓటమి పై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా స్పందించాడు. బ్యాటింగ్ లో విఫలం అయ్యమని, అనుకున్న ప్రణాళికను అమలు చేయలేకపోయినట్టు వెల్లడించాడు. ముందుగా భారత్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడి, తొలి పది ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి, భారత జట్టు రన్‌రేట్‌ను తగ్గించారు. రోహిత్ శర్మ దూకుడుకు మొదట్లోనే తమ బౌలర్లు డిఫెన్స్ లో పడ్డారు. తమ జట్టు పరాజయానికి కారణం రోహిత్ శర్మ అంటూ వెల్లడించాడు.
Also Read: విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న 10 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?