Ads
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల చిత్రాలు అయినా కూడా హిట్ అవ్వకపోతే ఓటిటి లోకి వెంటనే వస్తునాయి.సినిమా బాగుందనే టాక్ వస్తే తప్ప తప్ప చాలా మంది థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే నెల రోజుల క్రితం విడుదల అయిన ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చడీ చప్పుడు లేకుండా వచ్చేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ ఏంటి? ఇందులో చూడాలి అంటే…?
విక్రాంత్ రెడ్డి, మెహ్రీన్ పిర్జాదాలు హీరో హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రమే స్పార్క్ లైఫ్ అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. హీరోగా చేసిన విక్రాంత్ రెడ్డినే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పై ఫుల్ హైప్ ను క్రియేట్ చేసుకుంది.
Ads
మెహ్రీన్ తో పాటు రుక్సర్ ధిల్లాన్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కనిపించింది. అలాగే సుహాసిని, నాజర్, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యాంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్రలు ప్రముఖ పాత్రల్లో నటించి మెప్పించారు.ఈ చిత్రానికి అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అలాగే కోలీవుడ్ నటుడు గురు సోమసుందరం ఈ చిత్రంలో విలన్ గా కనిపించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ పై చాలా మంది మంచి రీవ్యూలు కూడా ఇచ్చారు. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదంటూ కొందరు నెగటివ్ మార్కులు వేశారు.
థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయంది. కలెక్షన్లలను కూడా ఎక్కువగా రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం స్పార్క్ లైఫ్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమంగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూడకపోతే ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూడండి.