Ads
మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలలో వార్తలు నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా వీరి పెళ్లి వేడుకల ఫోటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ నెట్టింట్లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా ఈ పెళ్లికి హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే అందరు వేడుకల ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా, వైరల్ గా మారాయి. ఈ పెళ్లిలో మెగా డాటర్ శ్రీజ సందడి చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్యలతో కలిసి శ్రీజ దిగిన ఫోటోలు, నిహారిక, శ్రీజ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్లలో పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు వీడి వీడిగా ఉంటున్నారని కూడా కథనాలు వినిపించాయి. తాజాగా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఆ పోస్ట్ లో “విషయాలు నా కంట్రోల్ లో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్న సమయంలో, మనసు గాయపడుతుంది మరియు విరిగిపోతుంది. మనస్సు కలత చెందుతుంది, క్షీణిస్తుంది, శరీరం అలసిపోతుంది, బలహీనం అవుతుంది. అప్పుడు కళ్ళు మూసుకుని, నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి తిరిగి కనెక్ట్ అవ్వండి. ఇదొక్కటే మార్గం.” అంటూ శ్రీజ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు కామెంట్ సెక్షన్ డిజబుల్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: 40 దాటినా కూడా ఇంత యంగ్ గా ఉన్న… ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?