Ads
సినిమాలలో తమ అభిమాన హీరోలు స్టైల్ గా సిగరెట్ కాల్చే సన్నివేశాలను చూసి అబ్బా మా హీరో చాలా స్టైల్ గా సిగరెట్ ను వెలిగిస్తున్నాడని లేదా స్టైలిష్ గా స్మోక్ చేస్తున్నాడని ఫ్రెండ్స్ కి చెప్తూ మురిసిపోతుంటారు. కొందరు ఫ్యాన్స్ అక్కడితో ఆగితే, మరికొందరు సిగరెట్ కాలుస్తున్న హీరోని చూసి, ధూమపానం అలవాటు ప్రారంభించి, ఆ తరువాత ఇబ్బందులు పడిన వాళ్ళు లేకపోలేదు.
Ads
సాదారణంగా సినిమా ప్రారంభం అయ్యే ముందు ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని చిత్రంలోని యాక్టర్స్ తో చెప్పించినా కూడా దాన్ని అనుసరించే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోలలో స్మోకింగ్ అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇది అందరకి తెలిసిన విషయమే. అయితే కొందరు స్టార్ హీరోలు మొదట్లో ధూమపానం అలవాటు ఉన్నప్పటికీ, ఆ తరువాత స్మోకింగ్ అలవాటును మానేశారు. తమ ఫ్యాన్స్ ని కూడా ధూమపానం మానేయమని అని కోరారు. మరి ధూమపానం లాంటి భయంకరమైన అలవాటును మానేసిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..1. కమల్ హాసన్ :
కమల్ పదకొండేళ్ళ వయసులోనే సిగరెట్ అలవాటును మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత ధూమపానంను మానేశారు.
2. రజినీకాంత్ :
సిగరెట్ ని స్టైల్ గా కాల్చడంలో సూపర్ స్టార్ రజినీ తరువాతనే ఎవరైనా. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ అలవాటు ఉంది. కాగా డిసెంబర్ 12 2012లో రజినీ కాంత్ ధూమపానం మానేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా తన ఫ్యాన్స్ కూడా ధూమపానం వైపుకు వెళ్లకూడదని కోరారు. అయితే రజిని ఈ అలవాటు మానేయడానికి కారణం ఆయన మనవడు.
3.మమ్ముట్టి :
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మొదట్లో ధూమపానం చేసేవాడు. ఆయన ఏడు సంవత్సరాల క్రితం దానికి స్వస్తి పలికాడు.
4.మహేష్ బాబు :
మహేష్ బాబు తన ఫ్రెండ్ ఇచ్చిన ఒక బుక్ ని చదివిన తరువాత స్మోకింగ్ అలవాటును మానేశాడు. ఆయన నటించిన పోకిరి, అతిథి చిత్రాల సమయంలో గ్యాప్ ఇవ్వకుండా ధూమపానం చేసేవారట. ప్రస్తుతం మహేష్ అలాంటి సీన్స్ లో నటించడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
5.పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ ‘ఖుషి’ మూవీ సమయంలో ధూమపానం చేసాడు. ఆ మూవీ తరువాత నుండి స్మోకింగ్ జోలికి వెళ్లలేదు.
6.రానా దగ్గుబాటి :
రానా తను నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ సమయం వరకు ధూమపానం చేసాడు. అయితే ఆ మూవీకి డబ్బింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడడం జరిగింది. వైద్యుల సలహాతో స్మోకింగ్ ను దూరం పెట్టినట్టు సమాచారం.
7.విజయ్ దేవరకొండ :
రౌడీ హీరో ‘అర్జున్ రెడ్డి’చిత్ర సమయంలో ఎక్కువగా స్మోక్ చేసేవారట. అనంతరం ధూమపానంకు దూరంగా ఉంటున్నాడు.
8. అమిర్ ఖాన్ :
ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ తన పిల్లలు కోరక మేరకు స్మోకింగ్ ను మానేశాడు.9.సల్మాన్ ఖాన్ :
బాలీవుడ్ కండల వీరుడు ఒకప్పుడు చైన్ స్మోకర్. అయితే ఆ అలవాటు వల్ల సల్మాన్ ఆరోగ్యం దెబ్బతినడంతో డాక్టర్ల సలహాతో స్మోకింగ్ కి దూరమయ్యాడు.
10.హృతిక్ రోషన్ :
హృతిక్ కి మొదటి నుండి స్మోకింగ్ అలవాటు లేదు, మధ్యలో అలవాటు అయ్యింది. హృతిక్ రియలైజ్ దానికి గుడ్ బై చెప్పాడు.Also Read: ”సౌందర్య” భర్త ఎవరో మీకు తెలుసా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?