Ads
తక్కువ ఖర్చుతో మనం రైళ్లలో ప్రయాణం చేయొచ్చు. పైగా దూర ప్రయాణాలు చేయడానికి కూడా రైలు లో వెళితే కంఫర్ట్ గా ఉంటుంది. చక్కగా నిద్రపోయి మనం రైలు లో ప్రయాణం చేయవచ్చు. ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణానికి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఒకటి రెండు రోజులు పట్టినా కూడా కంఫర్ట్ గానే మనం రైలులో వెళ్ళచ్చు. ఏ ఇబ్బంది ఉండదు.
పైగా ఇప్పుడు సదుపాయాలు కూడా పెరగడంతో చక్కగా తక్కువ ఖర్చుతో కంఫర్ట్ గా మనం వెళ్లొచ్చు. అయితే మామూలుగా గమ్యస్థానాన్ని బట్టి రైళ్ళకి పేర్లు ఉంటాయి.
గోదావరి, విశాఖ ఇలా రైళ్ళకి పేర్లు పెట్టారు. అలానే బెంగుళూరు చెన్నై మెయిల్, హౌరా ముంబై మెయిల్ ఇలా ట్రైన్ లకి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లను చూస్తే ఈజీగా మనం గమ్యస్థానాన్ని ఆధారంగా తీసుకుని పేర్లు పెట్టారని చెప్పొచ్చు. కానీ కొన్ని రైళ్లకు మాత్రం పేర్లు అలా ఉండవు. గమ్యస్థానాన్ని బట్టి ఆ పేర్లు పెట్టలేదు.
Ads
ఉదాహరణకి శతాబ్ది ఎక్స్ప్రెస్, దూరంతో ఎక్స్ప్రెస్ ఈ పేర్లు చూస్తే మనకి ఎందుకు ఈ పేర్లు పెట్టారు..? అసలు సంబంధం లేకుండా ఎందుకు ఈ పేర్లు పెట్టారు అని అనిపిస్తూ ఉంటుంది… కానీ దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ విషయమే చూద్దాం. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మొదటి చైర్ కార్ ట్రైన్. ఆనాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా ఈ ట్రైన్ ని మొదలు పెట్టారు.
నెహ్రూ వందవ జయంతి కాబట్టి ట్రైన్ కి శతాబ్ది పేరు వచ్చింది. అదే రాజధాని ఎక్స్ ప్రెస్ ని చూస్తే.. ఢిల్లీ నుంచి ఇతర రాజధానులకు ఈ ట్రైన్ వెళ్తుంది. రాజధాని నగరాల మధ్య ప్రయాణం చేయడం వలన ఈ రైలు కి రాజధాని అని పేరు పెట్టడం జరిగింది. ఇక దురంతో అని ఎందుకు పెట్టారంటే.. ఈపేరు బెంగాలీ భాష నుంచి వచ్చింది. బెంగాలీ లో దురంతో అంటే అంతరాయం లేనిదని. తక్కువ స్టేషన్స్ లోనే ఈ ట్రైన్ ఆగుతుంది.