Ads
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. అందులో రష్మిక మందన్న, అల్లు అర్జున్ మీద చిత్రీకరించిన పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే ఈ పాటని శ్రేయ ఘోషల్ పాడారు. పాట రిలీజ్ అయిన వెంటనే అందరికీ నచ్చేసింది. ఇప్పుడు చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాట మీద చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. అయితే చాలా మంది డాన్స్ వీడియోలు మాత్రమే చేస్తున్నారు.
కొంత మంది మాత్రమే ఈ పాట పాడే సాహసం చేస్తున్నారు. అంత కష్టంగా ఉంటుంది ఈ పాట. అయితే ఇటీవల ఒక అమ్మాయి శ్రేయ ఘోషల్ లాగానే ఈ పాట పాడింది. ఈ పాట చూసిన చాలా మంది, “శ్రేయ ఘోషల్ కంటే నువ్వే బాగా పాడావు” అంటే, కొంత మంది “ఒరిజినల్ పాటకి, ఈ పాటకి తేడా తెలియట్లేదు. అంత బాగుంది” అంటూ అమ్మాయిని పొగుడుతున్నారు. ఈ అమ్మాయి పేరు సునిధి గణేష్. 21 సంవత్సరాల సునిధి గణేష్ బెంగళూరుకి చెందినవారు. ఈ అమ్మాయి ఒక ప్లేబాక్ సింగర్ కూడా. కన్నడలో కొన్ని పాటలు పాడింది. ఇప్పుడు పుష్ప సినిమాలోని పాటని తెలుగులోనే పాడి పోస్ట్ చేసింది.
చాలా మంది తన తెలుగు బాగుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సునిధి స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని పోస్ట్ చేస్తుంది. అంతే కాకుండా పాటల వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఎన్నో పాటలు పాడి వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత గుర్తింపు సంపాదించుకోవడం అంటే చాలా గొప్ప విషయం. తెలుగులో కూడా సునిధి పాడుతుంది ఏమో వేచి చూద్దాం.