నందమూరి తారకరత్నకు ఆయన తల్లిదండ్రులతో మాటల్లేవా.. తారకరత్న స్నేహితుడు ఏం చెప్పాడంటే?

Ads

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబం, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే తారకరత్న వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాలలో, మీడియాలోను రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Ads

ఈ వార్తలు వైరల్ గా మారడంతో ప్రస్తుతం వేటిని, నమ్మాలో వేటిని నమ్మకూడదో తారకరత్న ఫ్యాన్స్ కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో నందమూరి తారకరత్న మిత్రుడు అయిన సురేష్ వైరల్ గా మారిన వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ తారకరత్న, అలేఖ్యా రెడ్డి ప్రేమించుకున్నారని సురేష్ తెలిపారు.
వీరిద్దరూ ఒక కామన్ స్నేహితుడు ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని సురేష్ అన్నారు. అయితే అలేఖ్య రెడ్డి గతం అనేది పీడకల అని అన్నారు. తారకరత్నను అలేఖ్య అమ్మగారు కొడుకులా చూసేవారని తెలిపారు. వీరి పెళ్లికి అలేఖ్య ఇంట్లో వాళ్ళు అంగీకరించారని, అయితే తారకరత్న ఇంట్లో అంగీకరించలేదని సురేష్ తెలిపారు. కానీ బాలకృష్ణగారు మాత్రం అంగీకరించారని ఆయన తెలిపారు. తారకరత్న తండ్రి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు.
అలేఖ్య రెడ్డికి ఒక సోదరుడు ఉన్నాడని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అలేఖ్య చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపారు. తారకరత్నకు బాలకృష్ణ బాబాయ్ అంటే చాలా ఇష్టమని సురేష్ తెలిపారు. పెద్దమ్మాయి నిషిక అంటే ఆయనకు ప్రాణమని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పెద్దమ్మాయిని అమెరికాలో చదివించాలని అనుకునేవారని తెలిపారు. ఆర్ధికంగా ఇబ్బంది పడే స్థితి అయితే తారకరత్నకు లేదని అన్నారు.
అలాగే తారకరత్నకు అప్పులు కూడా లేవని, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. అయితే ఆయనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని అన్నారు. సిటీలో ఉన్నప్పుడు జిమ్ కు వెళ్లేవారని తెలుస్తోంది. అలేఖ్యతో పెళ్లి అనంతరం తారకరత్నకు తల్లీదండ్రులతో మాటలు ఉన్నప్పటికి  కొంత గ్యాప్ అయితే ఉండేదని సమాచారం. తారకరత్న ఫ్రెండ్ సురేష్ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: పునీత్ రాజ్ కుమార్ టూ తారకరత్న.. ఇటీవల కాలంలో గుండెపోటుతో కన్నుమూసిన 7గురు సెలెబ్రిటీలు..

Previous articleభీమ్లా నాయక్ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, రానాకు మధ్య జరిగే ఫైట్ సీన్ ని అక్కడి నుండి తీసుకున్నారా?
Next articleఎంతోమందిని స్టార్ హీరోలుగా చేసిన దర్శకులు వారి కుమారులకి ఒక్క హిట్ ఇవ్వలేకపోయారు.. వారేవరంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.