Ads
పారిజాతం, సంతాన వృక్షం, మందారం, కల్పవృక్షం, హరిచందనం. ఈ ఐదు వృక్షాలని దేవతా వృక్షాలని పిలుస్తారు. వీటికి మాలిన్యం ఉండదని అంటారు. వీటిలో పారిజాతం వృక్షం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించింది.
Ads
పారిజాతం చాలా శ్రేష్ఠమైనది. ద్వాపర యుగంలో సత్యభామ కోరడంతో శ్రీకృష్ణుడు స్వర్గలోకానికి వెళ్లి, దేవేంద్రుణ్ణి జయించి, పారిజాత వృక్షాన్ని భూంఈ పైకి తీసుకువచ్చాడని పురాణ గాథ. పారిజాత పుష్పాలు ఎర్రటి కాడలను కలిగినటువంటి తెలుపు రంగులో ఉండే పుష్పాలు. అంతేకాకుండా పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ, ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఇలాంటి పుష్పాలు సుమారు తొమ్మిది రకాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ పుష్పాలతో దేవతార్చన చేస్తే సకలమైన శుభాలూ కలుగుతాయని అందరి నమ్మకం. అయితే, ఈ పుష్పాలు ఇంద్రుడి శాపం వల్ల రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తాయి.కానీ తెల్లవారేసరికి రాలిపోతాయి. రాలిన పూలన్నీ తెల్లని తివాచీ పరచినట్లుగా కనిపిస్తాయి.అలా కింద పడిన పుష్పలను జాగ్రత్తగా ఏరి, దేవుడిని పూజించడానికి వినియోగిస్తారు.సాధారణంగా అయితే పూజకు ఉపయోగించే పూలను కింద పడకుండా, చెట్టు నుంచి కోసిన పువ్వులతో పూజ చేస్తేనే మంచి జరుగుతుందని అనుకుంటాం. కానీ పారిజాత పువ్వులను ఎప్పుడూ చెట్టు నుండి కోసి పూజలో ఉపయోగించ కూడదు. కింద రాలిన పారిజాత పుష్పాలను తీసుకొని దేవుడికి పూజకు వినియోగించాలి.
అలా ఎందుకు అంటే, సహజంగా ప్రతి చెట్టు భూమి నుండి వస్తుంది. ఆ చెట్లు పూలను వికసిస్తుంది.అయితే పారిజాత వృక్షం పురాణాలలో ఉన్న ప్రకారం స్వర్గలోకం నుండి భూమి పైకి వచ్చింది. కాబట్టి పారిజాత పుష్పాలు నేలను తాకిన తరువాతనే వాటిని తీసుకొని పూజ చేయాలని చెబుతారు. అందు వల్లనే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి, పూజ చేయడంతో దేవతల అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే పారిజాత పుష్పాలను పొరపాటున కూడా వేరేవారి దగ్గర నుండి తీసుకొని పూజకు వినియోగించకూడదు. అలా చేసినట్లయితే పూజాఫలం ఎవరి దగ్గర నుండి తీసుకున్నామో వారికే దక్కుతుంది.
Also Read: పరమశివుడి పూజలో సింధూరం, పసుపు ఎందుకు ఉపయోగించరో తెలుసా?