Ads
దంగల్ మూవీ ఫేమ్ నితేష్ తివారి తీస్తున్న రామాయణం సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. రోజుకు ఒక పేరు తెర మీదకి వస్తుంది. ఇన్ని రోజులు సీత పాత్రలో సాయి పల్లవి కనిపిస్తుంది అని వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పుడు ఆ పాత్ర జాన్వీ కపూర్ పోషించబోతుందని సమాచారం. అయితే రాముడిగా మాత్రం రణబీర్ కపూర్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సీత విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతుంది అని తెలుసుకున్న ప్రేక్షకులు ఆ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది అంటూ ఆమెను సీతగా ఊహించుకున్నారు. కొందరు ఔత్సాహికులు ఆమెను సీతగా ఏ ఐ ద్వారా ఫోటోలు కూడా క్రియేట్ చేశారు. అయితే సీత పాత్రను ఇప్పుడు సాయి పల్లవి కాకుండా జాన్వీ కపూర్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా గురించి మొదటిసారిగా నిజజీవితంలో భార్యాభర్తలయిన రణబీర్ కపూర్, అలియా భట్ సీతారాములుగా నటిస్తారని అనుకున్నారు.
Ads
అయితే అలియా భట్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వలన డేట్లు కుదరకపోవడంతో ఆ సినిమాలో సీతగా సాయి పల్లవి ఫైనల్ చేశారని కొద్ది రోజుల కింద తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కాకుండా జాన్వీ కపూర్ నటించబోతుందని, ఈ ఫిబ్రవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం.ఇక ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ నటించబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే దీని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్, హనుమంతుడు పాత్ర కోసం సన్నీడియోల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. విభీషణుడి పాత్ర తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా టీం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.