సిద్ధు-అనుపమ “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రివ్యూ..! ఈసారి కూడా హిట్ పడినట్టేనా..?

Ads

ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ  హీరోగా నటించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.

అప్పుడు ఇలాంటి కామెడీ ఉన్న సినిమాలు రావడం తక్కువ. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాతో హీరో రేంజ్, హీరోయిన్ రేంజ్ మారిపోయింది.

tillu square trailer review

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ విడుదల అవుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేశారు. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇది మొదటి పార్ట్ అయిన డీజే టిల్లుకి కొనసాగింపులాగానే ఉంది. ఇంక ట్రైలర్ విషయానికి వస్తే, ఇందులో కూడా ఒక హీరోయిన్, ఆమెకి ఏదో కథ, మళ్ళీ హీరో చిక్కుల్లో పడడం, ఇదే ఫార్మాట్ లో నడుస్తుంది అని అర్థం అవుతోంది. మొదటి భాగం కూడా ఇలానే ఉంటుంది. దాని ట్రైలర్ కట్ కూడా ఇలాగే ఉంటుంది.

tillu square trailer review

Ads

ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా యూత్ ని ఆకర్షించడానికి ఏవో కొన్ని అంశాలు పెట్టి తీసినట్టు ఉంది కానీ పెద్దగా కొత్తదనం ఏమీ అనిపించలేదు. ట్రైలర్ మొత్తం కూడా అనుపమ సీన్స్ తో నింపేశారు. అంతకుముందు రౌడీ బాయ్స్ ట్రైలర్ విషయంలో కూడా ఇలాగే చేశారు. అంతే కాకుండా టిల్లు మాటిమాటికి గతంలో తనని రాధిక అని ఒక అమ్మాయి మోసం చేసింది అని, దానికి సంబంధించిన సంఘటనలు గుర్తు చేసుకుని, ఆ డైలాగ్స్ వాడడం చాలా ఎక్కువగానే ఉంది.

tillu square trailer review

ఒకటి, రెండు చోట్ల ఇలా చేస్తే బాగానే ఉంటుందిలే కానీ, ట్రైలర్ మొత్తం ఇలాగే చేసి పాత సంఘటనలు గుర్తు చేసి నవ్వించాలి అని ప్రయత్నించడం మాత్రం అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడి మార్చ్ లో విడుదల అవుతోంది. కొంత మంది అందుకు కారణం ఈ సినిమాలో సీన్స్ మళ్లీ షూట్ చేయడం అని కూడా అన్నారు. ఏదేమైనా సరే, ట్రైలర్ కాస్త నిరాశపరిచింది అంటున్నారు. ఇది ప్రేక్షకులకి ఉన్న అంచనాల వల్ల కావచ్చు. సాధారణంగా చాలా మంది ట్రైలర్ లో పెద్దగా కథ ఏమి రివిల్ చేయకుండా, థియేటర్ లో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటారు. మరి ఈ సినిమా బృందం కూడా అలాగే అనుకున్నారేమో. మిగిలిన విషయాలన్నీ కూడా తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.

Previous article“సైడ్ క్యారెక్టర్” నుంచి… “హ్యాట్రిక్ హీరో” గా మారిన జోష్ సినిమా ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
Next article“ఊరు పేరు భైరవకోన” ప్రీమియర్స్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?