Ads
తెలుగు సినీ పరిశ్రమను ఎక్కువగా ఆంధ్ర ప్రాంతపు నటీనటులే మొదటి నుండి ఏలుతున్నారు. హీరోహీరోయిన్ల దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఇక తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినవారిని టాలీవుడ్ లో వేళ్ల పైన లెక్కించవచ్చు.
అయితే తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినవారిలో కూడా ఒకే జిల్లా నుండి ఇండస్ట్రీకి వచ్చినవారు చాలా మంది ఉన్నారు. ఇంతకి ఆ జిల్లా ఏమిటి అంటే నిజామాబాద్. మరి అక్కడి నుండి వచ్చి టాలీవుడ్ లో కొనసాగుతున్న ఆ సెలెబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Ads
1.దిల్ రాజు:
దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు చెందినవారని దాదాపు అందరికి తెలుసు. ఆయన డిస్ట్రిబ్యూటర్ మొదలైన ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత. స్టార్ హీరోలందరితోను సినిమాలను నిర్మించారు.
2.హీరో నితిన్:
యంగ్ హీరో నితిన్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాంలో సినీ డిస్ట్రిబ్యూటర్. దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో హీరోగా మొదటి సారి నటించాడు. ఆ మూవీ హిట్ అవడంతో వరుస ఆఫర్స్ తో హీరోగా కొనసాగుతున్నాడు.
3.యాంకర్ శ్రీముఖి:
యాంకర్ శ్రీముఖి సింత జిల్లా కూడా నిజామాబాద్. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ నిజామాబాద్ లోనే నివసిస్తున్నారు. ఆమె యాంకర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
4.వెన్నెల కిషోర్:
తెలుగులో టాప్ కమెడియన్ కొనసాగుతున్న వెన్నెల కిషోర్ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో జన్మించాడు. కిషోర్ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, సినిమాల పై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
5.అదితిమ్యాక్యాల్:
తెలుగు నటి అదితిమ్యాక్యాల్ కూడా నిజామాబాద్ కి చెందినవారు. ఆమె తండ్రి హైదరబాద్ లోని ఓ ప్రభుత్వ కాలేజీలో ప్రిన్సిపాల్. ఆమెకు నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
6.చమ్మక్ చంద్ర:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు సొంతం చేసుకున్న కమెడియన్ చమ్మక్ చంద్రది కూడా నిజామాబాద్ కి చెందినవారే. చంద్ర ప్రస్తుతం అటు సినిమాలతో ఇటు టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్నాడు.
7.యాంకర్ శివజ్యోతి:
యాంకర్ శివజ్యోతి నిజామాబాద్ లోనే పుట్టి, పెరగింది. తన చదువు కూడా ఆకక్డే సాగింది. శివజ్యోతి ప్రస్తుతం పలు బుల్లితెర షోలతో బిజీగా ఉంది.
Also Read: హాలీవుడ్ సినిమాల పోస్టర్లను కాపీ కొట్టిన 11 తెలుగు చిత్రాలు ఇవే..