బేబమ్మ లాగే…ఇక్కడ అవకాశాలు తగ్గి మలయాళ బాట పడుతున్న టాప్ హీరోయిన్లు ఎవరంటే.?

Ads

సినీ ఇండస్ట్రీలో హీరోల‌కు ఉండే లాంగ్ లైఫ్ కెరిర్ పరంగా హీరోయిన్లకు ఉండ‌దనే విషయం తెలిసిందే. దానికి పలు కారణాలు ఉండవచ్చు. ప్ర‌తి ఏడాది ఇండ‌స్ట్రీకి కొత్తవారు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అప్పటికే టాప్ హీరోయిన్ గా ఉన్నవారైన సరే సరైన హిట్స్ లేకపోతే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.

Ads

అందువల్ల హీరోయిన్ల మధ్య చాలా పోటీ నెల‌కొంటుంది. దీనికి తోడు కొంతకాలం నుండి ప్యాన్ ఇండియా చిత్రాల పరంపర ఎక్కువై, అన్ని ఇండస్ట్రీల ద్వారాలు తెరచుకోవడంతో టాలీవుడ్ హీరోయిన్ల మధ్య  కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్స్ కొందరు కన్నడ బాట పడుతున్నారు.
ప్రస్తుతం తెలుగులో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ కు మరియు అవకాశాలు తగ్గిపోయిన హీరోయిన్స్ మలయాళ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరుస్తోంది. అలా టాలీవుడ్ నుంచి మాలీవుడ్ కు వెళ్ళి అవకాశాలు పొందుతున్నారు ముగ్గురు హీరోయిన్స్.
స్టార్ హీరోయిన్ తమన్నా సుమారు 20 సంవత్సరాల నుండి రాణిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్నా కెరీర్ దాదాపు ముగిసినా, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె తెలుగు, హిందీ, తమిళ,  కన్నడ లాంటి భాషల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమన్నా త్వరలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. బాంద్రా అనే మలయాళ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది
అనుష్క శెట్టి సినిమాలలో అవకాశాలు పొందడంలో కాస్త వెనకబడిన విషయం తెలిసిందే. సైజ్ జీరో మూవీ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ హిట్ అవడంతో మళ్లి అనుష్క మలయాళ ఇండస్ట్రీ నుండి అవకాశం అందుకున్నారు. ‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్ అనే థ్రిల్లర్ ఫాంటసీ మూవీతో అనుష్క మాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ 2 పార్ట్ లు గా రిలీజ్ అవుతుందని సమాచారం.
కృతి శెట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తరువాత వరస ఫ్లాప్స్ అందుకుంది. దాంతో  ఆమెకు తెలుగు చిత్రాలలో అవకాశాలు రావడం కష్టంగా మారింది. అయితే కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ఇక త్వరలో మలయాళ ఇండస్ట్రీలో కూడా అడగుపెట్టనుంది. టోవినో థామస్ నటిస్తున్న అజాయంతే రాండమ్ మోషణం మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

Also Read: 45 కోట్ల బడ్జెట్ తో సినిమా తీశారు…కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.!

 

Previous articleఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ “హన్సిక” వెబ్ సిరీస్ చూసారా.? అసలు ఇందులో ఏముంది.?
Next articleఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా…సెమీఫైనల్ చేరాలంటే “పాక్” జట్టు ఇలా చేయాలా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.