Ads
జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైట్డ్ మూవీ దేవర కోసం అబిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తుంది. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో కొత్తరకం వార్త వైరల్ అవుతుంది. ఈ ఇద్దరి మధ్య సరికొత్త రిలేషన్షిప్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవమే…
ఎన్టీఆర్ జాన్వికి కలిసి ఎలా నటించారు అని క్వశ్చన్ చేస్తున్నారు ఓ నెటిజెన్..ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకుందాం పదండి. అదేనండి వరుసకి ఎన్టీఆర్ కు జాహ్నవి మేనత్త అవుతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉందా…జాహ్నవి ఏంటి ..?ఎన్టీఆర్ కి మేనత్త అవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి.
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి టాలీవుడ్ లో అందరికీ సుపరిచితం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తోటే కాకుండా వాళ్ళ పిల్లల తరం హీరోలు నాగర్జున ..వెంకటేష్ తో కూడా నటించింది. కానీ ఒక్క బాలకృష్ణతో మాత్రం శ్రీదేవి ఏ మూవీలో నటించలేదు దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. తన తండ్రితో ఎక్కువగా హీరోయిన్గా చేసిన శ్రీదేవి తనకు తల్లితో సమానం అవుతుందని అందుకే ఆమెతో ప్రేమికుడిగా, భర్తగా నటించలేదని బాలకృష్ణ చెప్పాడట.
Ads
శ్రీదేవి బాలకృష్ణకు తల్లి సమానమైతే ఎన్టీఆర్ కు నానమ్మ అవుతుంది కదా. మరి ఆ లేఖన తీసుకుంటే శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ కు మేనత్త కదా. మరి బాలకృష్ణ శ్రీదేవితో నటించినప్పుడు ఎన్టీఆర్ జాన్వితో ఎలా నటిస్తున్నాడు అని నటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మేనల్లుడు అత్త కాంబినేషన్ ఏంటి అంటూ ఆ నెటిజెన్ ట్వీట్ చేసాడు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సిల్లీ విషయంపై మిమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అయితే దీనికి కొందరు ఇలాంటి పిచ్చి లాజిక్కులు చెప్పకండి…ఆ లెక్కన తీసుకుంటే శ్రీదేవి ఎన్టీఆర్ కు మనవరాలుగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి కదా అని అంటున్నారు. మొత్తానికి ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం అని…సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరికి తోచిన వార్త వాళ్ళు వైరల్ చేస్తున్నారు.