Ads
సాధారణంగా అమ్మాయిలకు 25 ఏళ్లు వస్తే, ముందుగా అడిగేది పెళ్లెప్పుడు అని, అయితే ప్రస్తుత కాలంలో కెరీర్ పేరుతో అమ్మాయిలు పెళ్ళిని 30 దాకా తీసుకువెళ్తున్నారు. ఇక హీరోయిన్స్ ముప్పై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో పలువురు హీరోయిన్లు పెళ్ళి పీటలు ఎక్కారు. అయితే కొందరు సీనియర్ హీరోయిన్లు మాత్రం 40, 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
- శోభన :సీనియర్ హీరోయిన్ శోభన ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించి, స్టార్ డమ్ అందుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. అయితే 50 ఏళ్ల వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
2. టబు :
హీరోయిన్ టబు బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసినా, తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఆమె వయసు 48 ఏళ్ళు, అయినా పెళ్లి చేసుకోలేదు.
3. సితార :
Ads
తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి సితార. ఆమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ మూవీలో హీరో నాని తల్లి పాత్రలో నటించింది. సితారకు 47 ఏళ్ళు, అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
4. నగ్మా :
ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా. ఆమె తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. నగ్మా వయసు 45 ఏళ్ళు. అయినా ఆమె పెళ్లి చేసుకోలేదు.
5. సుస్మితా సేన్ :
విశ్వ సుందరి, సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. సుస్మితా సేన్ వయసు 44 ఏళ్లు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.
6. కౌసల్య :
అల్లుడుగారు వచ్చారు సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కౌసల్య, సాంప్రదాయక పాత్రలలో ఎక్కువగా నటించింది. ప్రస్తుతం తల్లి, అత్త క్యారెక్టర్లలో నటిస్తోంది. ఆమె వయసు 40 ఏళ్ళు. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
Also Read: సెన్సార్ రివ్యూ: కోటబొమ్మాళి పీఎస్ మూవీ హిట్ పక్కానా.. అలాంటి అంచనాలను క్రియేట్ చేయనుందా?