Ads
ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెగాపవర్ స్టార్ రామ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల ద్వారా పాపులర్ అయ్యారు.
ఈ ఏడాది ఉపాసనకు కూతురు క్లీన్ కారాకు జన్మించిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన 11 ఏళ్ళ తరువాత మెగా వారసురాలు రావడంతో రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగా ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఉంది. అయితే తాజాగా ఉపాసన ఆస్తుల గురించిన వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చిరుతతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రామ్ చరణ్ మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తండ్రి తగ్గ కుమారుడిగా నిరూపించుకున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2012లో వివాహం చేసుకున్నాడు. పాప క్లీన్ కారా రాకతో ఉపాసన చాలా సంతోషంగా ఉంది. అయితే ఆమె ఆస్తి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన కామినేని, రామ్ చరణ్‌ల నికర విలువ దాదాపు 2500 కోట్లు.
ఉపాసన కామినేని స్వంత నికర ఆస్తి విలువ రూ. 1,130 కోట్లు. రామ్ చరణ్ నికర విలువ రూ.1,370 కోట్లు. ఉపాసన కామినేని చాలా పెద్ద వ్యాపార ఫ్యామిలీ చెందినవారు. ఉపాసన తాతయ్య వ్యాపార దిగ్గజం ప్రతాప్ సి.రెడ్డి. ఆయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్. ఆయన నికర ఆస్తి విలువ 21,000 కోట్లు. ప్రతాప్ సి.రెడ్డి. ఇండియాలోని టాప్ 100 మంది బిలియనీర్లలో ఒకరు. ఇక అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.70,000 కోట్లు.
ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్, ఆమె తల్లి శోభన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఉపాసన ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పట్టా తీసుకుంది. ఆమె చదువు పూర్తయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లో చేరింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాకుండా ‘బి పాజిటివ్’ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కూడా పని చేస్తున్నారు. ఆమె టీపీఎ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఈఏ గ్రూప్ ఫౌండర్.
Ads