Kabzaa Review: ఉపేంద్ర ”కబ్జా” సినిమా హిట్టా..?, ఫట్టా..?

Ads

సినిమా: కబ్జా
నటీనటులు : ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రీయ శరన్, శివరాజ్ కుమార్, మురళి శర్మ తదితరులు
దర్శకత్వం : ఆర్. చంద్రు
నిర్మాత : ఆనంద్ పండిత్, ఆర్. చంద్రు, అలంకార్ పాండియన్
సంగీతం : రవి బాసృర్
విడుదల తేదీ : మర్చి17, 2023

స్టోరీ :

భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు. అయితే కేజీఎఫ్ చూసిన వాళ్ళు ఈ సినిమాని లైట్ తీసుకోవచ్చు. గ్యాంగ్స్టర్ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉపేంద్ర పేరు తెచ్చుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. స్వాతంత్రం రాకముందు మొదట ఈ కథలో చూపిస్తారు. ఆర్కేశ్వర (ఉపేంద్ర) తన తల్లి సోదరుడుతో ఉంటాడు తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. ఇప్పుడు 1970 లలో అడల్ట్ వెర్షన్ చూపిస్తారు ఎయిర్ ఫోర్స్ సోల్జర్ కింద ఉపేంద్ర నటిస్తాడు.

అతడి సోదరుడిని గ్యాంగ్స్టర్ చంపేస్తారు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఒక లోకల్ గ్యాంగ్స్టర్ ని చంపేస్తాడు. మధుమతి (శ్రియ) అరకేశ్వర్ ని పెళ్లి చేసుకుంటుంది. మధుమతి ఒక పెద్ద పొలిటికల్ బ్యాగ్రవుండ్ ఉన్న కూతురు. క్లైమాక్స్ లో పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ఎలా తన సోదరుడిని చంపినా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడు అనేది కథ. ఇలా ఈ విధంగా కథ సాగుతూ ఉంటుంది. రెండవ పార్ట్ కూడా ఉంది. రెండో పార్ట్ కోసం ఆగాలి.

Ads

రివ్యూ:

సుదీప్ కి చాలా చిన్న పాత్ర ఇచ్చారు. కేవలం ఒక నెరేటర్ గానే కనబడతాడు. రెండో భాగంలో ఏమైనా ఎక్కువ పర్ఫామెన్స్ చేస్తాడేమో చూడాలి. శ్రీయ ట్రెడిషనల్ అవతార్ లో చాలా చక్కగా నటించింది. మురళీ శర్మ తదితరులు కూడా ఎంతో చక్కగా నటించారు. సినిమాలో బాగా పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేశారు.

శివన్న సర్ప్రైజ్ ఎంట్రీ గూస్ బంప్స్ ని తీసుకు వస్తుంది. ఉపేంద్ర యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ లో వుంది. క్లైమాక్స్ బాగుంటుంది. కేజీఎఫ్ స్థాయిలో మాత్రం లేదు. అంతలా ఎక్స్పెక్ట్ చెయ్యద్దు. స్క్రీన్ ప్లే బాగుంది. గ్రాఫిక్స్ ఇంకాస్త బాగుంటే బాగుండేది. కేజీఎఫ్ ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • క్లైమాక్స్
  • నటీ నటులు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • బ్యాడ్ డబ్బింగ్
  • స్టోరీ నెరేషన్

రేటింగ్: 1.5/5

Previous articleఇప్పటి వరకు ‘ఆస్కార్’ గెలిచిన 8 మంది భారతీయులు వీరే.
Next articleహీరోయిన్ రెజీనా టాలీవుడ్ లో ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది..