Ads
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా తండ్రి పేరును అంతగా వాడుకోకుండా తనకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నాడు. మత్తువదలరా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, హిట్ అందుకున్నాడు. కానీ ఆ తరువాత నటించిన చిత్రాలు ఎక్కువగా ఆడలేదు.తాజాగా ఉస్తాద్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- సినిమా : ఉస్తాద్
- నటీనటులు : శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్, అను హాసన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా తదితరులు..
- దర్శకత్వం : ఫణిదీప్
- సంగీతం : అకీవా బి
- నిర్మాత : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
- విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2023
స్టోరీ :
హైదరాబాద్ లో నివసించే సాధారణ యువకుడు సూర్య (శ్రీసింహ) చిన్నతనంలోనే తండ్రి(వెంకటేష్ మహా)ని మరణించడంతో, తల్లి (అను హాసన్) అతన్ని పెంచి పెద్ద చేస్తుంది. అయితే సూర్య ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. తల్లి కొనిచ్చిన బైక్ కు సూర్య ఉస్తాద్ అనే పేరు పెడతాడు. అతని ప్రతి ఎమోషన్ లో ఉస్తాద్ కూడా భాగమవుతుంది.
ఆ తరువాత సూర్య మేఘన (కావ్య కళ్యాణ్ రామ్) ను ప్రేమిస్తాడు. పైలట్ అవ్వాలనే ఆశయం కలిగిన సూర్య తన మానసిక సమస్యని ఎలా అధిగమించాడు? తన లవ్ స్టోరీలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పైలట్ అయ్యడా ? అనేది మిగతా కథ.
రివ్యూ:
Ads
తొలి సినిమా నుండి డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న శ్రీసింహ ఈ మూవీలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో మంచి నటనను ప్రదర్శించాడు. వీటిలో ముఖ్యంగా శ్రీసింహ కోపాన్ని పండించిన తీరు బాగుంది. ఇది యువతకు కనెక్ట్ అయ్యే వేరియేషన్. కావ్య కళ్యాణ్ రామ్ సహజమైన నటనతో ఆకట్టుకుంది. అను హాసన్, రవీంద్ర విజయ్, రవి శివతేజలు తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి శివతేజ తన కామెడీ పంచులతో అలరించాడు.
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, కథని స్క్రీన్ పై చూపించే విషయంలో మరింత జాగ్రత్త తీసుకొవాల్సిందనిపిస్తుంది. మూవీని చాలా సాగదీసిన భావన కలుగుతుంది. బోరింగ్‌గా అనిపిస్తుంది. అకీవ అందించిన నేపధ్య సంగీతం పర్వలేదనిపిస్తుంది. పవన్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
- డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్
- నటీనటుల నటన
- సినిమాటోగ్రఫీ
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- మూవీ నిడివి
- సాగదీసిన కథనం
- పాటలు
రేటింగ్:
2.5 / 5
watch trailer :