Ads
రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలో చేస్తూ ఉంటాడు మెగా హీరో వరుణ్ తేజ్. అదే కోవలో వరుణ్ తేజ్ చేసిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఎయిర్ ఫోర్సు బ్యాక్గ్రౌండ్ లో ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు.మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ ఎలా ఉందో చూద్దాం.
- చిత్రం:ఆపరేషన్ వాలెంటైన్
- నటీనటులు:వరుణ్ తేజ్,నవదీప్,మనుషి చిల్లర్,రుహాని శర్మ తదితరులు
- నిర్మాత:సందీప్ ముద్దా
- దర్శకత్వం:శక్తి ప్రతాప్ సింగ్
- సంగీతం:మిక్కీ జె.మేయర్
- విడుదల తేదీ:మార్చ్ 01 ,2024
స్టోరీ:
అర్జున్ రుద్రదేవ్ ( వరుణ్ తేజ్ ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రాన్ లీడర్ గా పనిచేస్తూ ఉంటాడు. దూకుడు ఎక్కువ, దేశం కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడే వ్యక్తి. ప్రాజెక్టు వజ్ర కోసం రుద్ర చేసిన సాహసం కారణంగా అతని స్నేహితుడు కబీర్ ( నవదీప్ ) మరణిస్తాడు. దాంతో ప్రాజెక్టుని అధికారులు బ్యాన్ చేస్తారు. ఈ సంఘటన కారణంగా అర్జున్ సాహసాలకు బ్రేక్ పడుతుంది. 2019 ఫిబ్రవరి 14న కాశ్మీర్లో పుల్వామా లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సైనికులు కన్నుమూస్తారు.
రివ్యూ:
ఆ ఎటాక్ పై రివెంజ్ తీర్చుకోవటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ ను సక్సెస్ చేసే బాధ్యతను తీసుకున్న అర్జున్ ఉగ్రవాదులను ఎలా అంతం చేస్తాడు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇండియా పై ఓ సీక్రెట్ కోడ్ పేరుతో పాకిస్తాన్ దాడి చేసేటందుకు ఎలాంటి ప్లాన్స్ వేసింది, అసలు ఆపరేషన్ వాలెంటైన్ ఏమిటి అనేది ఈ సినిమా కథ.
Ads
దేశాన్ని కాపాడటంలో వైమానిక దళం పాత్రను ఈ సినిమాలో అర్థవంతంగా చూపించాడు. డైరెక్టర్ జెట్ ఫైటర్ గా హీరో చేసే సాహసాలు, ఎయిర్ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ ని కలిగిస్తాయి. అయితే సర్జికల్ స్ట్రైక్ ని సక్సెస్ చేయడంలో వైమానిక దళం పడిన కష్టాన్ని పై పైన చెప్పినట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ సరిగ్గా వర్కౌట్ కాలేదు. గ్రాఫిక్స్ విషయంలో అక్కడక్కడ కాంప్రమైజ్ అయినట్లుగా అనిపిస్తుంది. సాంకేతికపరంగా మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్ :
- ఎమోషనల్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- నిర్మాణ విలువలు
- దేశభక్తి గురించి చూపించిన విధానం
మైనస్ పాయింట్స్:
- తెలుగులో కొంత మంది నటుల హిందీ మూమెంట్
- అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉన్న ఫస్ట్ హాఫ్
రేటింగ్:
3/5
watch trailer:
ట్యాగ్ లైన్ :
ఫస్ట్ హాఫ్ లో మాత్రమే సాగదీయడం లాంటివి ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ విజువల్స్ ఉన్న సినిమాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అలా ఉన్నా పర్వాలేదు, సినిమా కథనం ముఖ్యం అనుకునే వారికి, దేశభక్తి లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఇష్టపడే వారికి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఒక్కసారి చూడగలిగే ఒక మంచి ఎమోషనల్ సినిమాగా నిలుస్తుంది.