VENKY RE-RELEASE: రీ రిలీజ్ లో రికార్డు సృష్టించిన రవితేజ వెంకీ….కలెక్షన్స్ ఎంత అంటే…?

Ads

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ ఫేవరెట్ హీరోల సినిమాలను అభిమానులు పట్టుబట్టి రీ రిలీజ్ చేసి మళ్లీ పెద్దతరపై చూసి ఆనందిస్తున్నారు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఫిలిం వెంకీ సినిమా డిసెంబర్ 30 తారీఖున రీ రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పుడే ఆల్ టైం కామెడీ సినిమా గా నిలిచింది.

ట్రైన్ ఎపిసోడ్లో బ్రహ్మానందం రవితేజ ఏవీఎస్ కాంబినేషన్లో వచ్చే సీన్లు ఇప్పటికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే విధంగా ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ కి అయితే వెంకీ సినిమా ఒక టెంప్లేట్ అయిపోయింది. ఎవర్ని ట్రోల్ చేయాలన్న ఎవరికి రియాక్షన్ ఇవ్వాలన్న వెంకీ సినిమాలో రవితేజ బ్రహ్మానందం ఫోటోలు వాడుతారు. అసలు మీమ్స్ అంటే గుర్తొచ్చేదే వెంకీ సినిమా. అటువంటి సినిమా రియర్ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో మీమర్స్ వైరల్ చేశారు. థియేటర్లలో అభిమానులు ఎంజాయ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రవితేజ బ్రహ్మానందం పాత్రలకి డబ్బింగ్ చెబుతూ రచ్చ రచ్చ చేశారు.

Ads

అయితే వెంకీ సినిమా రి రిలీజ్ పుణ్యమా అంటూ స్ట్రైట్ సినిమాలుకు దెబ్బ పడింది. కళ్యాణ్ రామ్ డెవిల్ సుమ కొడుకు బబుల్ గమ్ సినిమాలకు వెంకీ సినిమా పెద్ద దెబ్బ కొట్టింది. ఆ సినిమాలకు మించిన కలెక్షన్స్ వెంకీ సినిమా సాధించింది.

ఈ మూవీ రెండు రోజుల్లో దాదాపు కోటి తొంభై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం ఒక్క రోజే వెంకీ మూవీ దాదాపు కోటి ముప్పై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఆదివారం రోజు అర‌వై ల‌క్ష‌ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఓవ‌రాల్‌గా రెండు రోజుల్లో వెంకీ మూవీకి కోటి తొంభై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

 

Previous articleన్యూ ఇయర్ కి అందరు హీరోయిన్స్ పబ్ లకి వెళ్తే…”సాయి పల్లవి” మాత్రం ఏం చేసారో తెలుసా.?
Next articleOLD PETROL BILL: 1963 నాటి పెట్రోల్ బిల్.. ఐదు లీటర్ల కి ఎంత అయిందో చూడండి!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.