Ads
అమీర్ ఖాన్ దంగల్, ప్రభాస్ బాహుబలి,కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి అంటే పర్వాలేదు.. కానీ చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించబడి బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. వచ్చే చిత్రం యురీ. పెట్టిన బడ్జెట్ కంటే కూడా 876% ట్రాఫిక్ ని ఆ చిత్రం తెచ్చింది అంటే ఏ రేంజ్ సక్సెస్ అయిందో ఆలోచించండి.
ఈ ఒక్క మూవీతో విక్కీ కౌశల్ పేరు మారుమోగడంతో పాటు అతని కెరియర్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. 2019లో విడుదలైన ఈ మిలిటరీ బేస్డ్ చిత్రం…2016 లో ఇండియన్ ఆర్మీ పై జరిగినటువంటి దాడులను అద్భుతంగా తెరకెక్కించింది. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ బెస్ట్ డైరెక్టర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
Ads
బీ ఎ మ్యాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ తనతోని సంపాదనకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత యాక్టింగ్ పై మక్కువ ఉండడంతో విక్కీ.. ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు.మొదట రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరిన విక్కీ ప్రొడక్షన్ బాయ్ గా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసేవాడట…అప్పుడు ఆతని తొలి సంపాదన కేవలం 1500 రూపాయలు.
అయితే ఆ మొదటి చెక్కు అందుకున్న సమయం మరపురాని అనుభవం అని గుర్తు చేసుకున్నాడు.అంచలంచెలుగా హీరోగా ఎదిగిన విక్కీ 2021లో బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంవత్సరం విక్కీ ఖాతాలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. తాజాగా ఈ హీరో తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.