Ads
ప్రముఖ తమిళ నటుడు డిఎండికే వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ అనారోగ్య కారణంగా గురువారం ఉదయం కన్ను మూసినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన గురించిన పలు విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన పుట్టుక గురించి ఆయన వివాహం గురించి, ఆస్తుల గురించి, జీవిత విశేషాల గురించి రాజకీయ ప్రవేశం గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఆస్తుల గురించి అప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 71 సంవత్సరాల వయసు కలిగిన విజయ్ కాంత్ ఐదు దశాబ్దాల తరబడి 150 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఇక ఆయన ఆస్తులు విషయానికి వస్తే 2006లో ఆయన రాజకీయంలో అడుగు పెట్టాడు. 2016లో విజయ్ కాంత్ పులుందరుపేట నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన పేరుపై ఉన్న ఆస్తుల విలువ 7.6 కోట్లు. అలాగే ఆయన భార్య ప్రేమలత ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల ఆస్తుల మొత్తం కలుపుకొని 14.79 కోట్లు ఉన్నట్లుగా వివరించారు. అలాగే ఆయన పేరు పై ఉన్న స్థిరాస్తుల విలువ 19.37 అని తన భార్య పేరు పై ఉన్న స్థిరాస్తుల విలువ 17.42 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.
Ads
మొత్తంగా ఆయన ఆస్తి 38.77 కోట్లుగా తెలుస్తోంది. 1970లో 200 రూపాయల పారితోషకం తీసుకున్న ఈయన చనిపోయే వరకు ఐదు నుంచి పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అలాగే హీరో మోటర్ కాప్, పెప్సీ, పాండ్స్ వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఒక్కొక్క దానికి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకునేవారు. ఈయన వద్ద ఉన్న కార్ల విలువే 3.50 కోట్లకు పైగా ఉంటుంది. 87 లక్షల విలువచేసే ఆడి క్యూ 7, 25 లక్షల విలువ చేసే టయోటా నావో కృస్టా.
96 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ x5, 1.2 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350, 36 లక్షలు విలువ చేసే ఫోర్డ్ ఎండోవర్ ఇలా చాలాకార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మొత్తంగా ఈయనకి 50 నుంచి 60 కోట్లు వరకు ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయనకి 14.72 కోట్లు అప్పులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్పట్లో ఆయన ఆస్తులు బ్యాంకు వారు వేలం వేసి ఆయన ఇంటిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.