Ads
భారతదేశంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. సుదీర్ఘమైన సముద్రతీరం కల ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈ నగరంలో ఉన్న ప్రతి బీచ్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది.
Ads
విశాఖపట్టణంలో ఉన్న బీచ్ లలో రుషికొండ బీచ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక వైపున కొండ, మరోవైపున చొచ్చుకొస్తున్నట్టుగా ఉండే సముద్రతీరం ఆకట్టుకుంటుంది. విశాఖపట్టణంకు వెళ్లినవారు ఈ బీచ్ ను చూడకుండా వెనుతిరుగరని చెప్పవచ్చు. అయితే ఈ బీచ్ కు సంబంధించిన ప్రస్తుత ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సిటీ ఆఫ్ డెస్టినీ గా పిల్చుకునే విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్ అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ల పక్కన 2020లో రుషికొండ బీచ్ కూడా స్థానం పొందింది. రుషికొండ బీచ్ కాలుష్య రహితంగా ఉండడం, సురక్షిత ప్రమాణాలు, మౌలిక వసతులు కూడా మెరుగవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీచ్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని బీచ్ లను ఎంపిక చేయగా వాటిలో రుషికొండ బీచ్ కూడా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 10 బీచ్ లకు ఇప్పటి వరకూ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంది. విశాఖ ఋషికొండ బీచ్ ఈ గుర్తింపు పొందిన తొమ్మిదవ బీచ్ గా నిలిచింది. రుషికొండ బీచ్ వద్దకు ప్రతి రోజు ఎంతోమంది సందర్శిస్తుంటారు.
స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. విదేశీయులు కూడా ఈ బీచ్ లో సందడి చేస్తుంటారు. మనోహరంగా, కాలుష్య రహితంగా ఉండే ఈ బీచ్ యొక్క ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టి చెత్త చెదరంతో కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను చూడిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: తిరుమలలో చోటుచేసుకున్న ఘటన..! అదృష్టం అంటే ఆ భక్తురాలిదే..!