Ads
మానవత్వాన్ని మించిన మతం లేదని అంటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో మానవత్వం అనేది కనపడడం లేదని చాలా సంఘటనలు చెబుతున్నాయి. అయితే అప్పుడప్పుడూ ఎక్కడో ఒక చోట జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చూసినపుడు మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంటుంది.
కొందరు సాటి మనుషులతోనే కాకుండా ఇంట్లోని పిల్లలపై కూడా నిర్ధాక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొందరు తమకు తెలియని, ఎటువంటి సంబంధం లేనివారి పట్ల కూడా ప్రేమను చూపిస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించినటువంటి వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.
ఇలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక పిల్లవాడి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హోటల్లో బాధగా కూర్చుంటాడు. ఆ టైమ్ లో ఆ హోటల్ లో తింటున్న ఒక మహిళ తింటూ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దానిని చూసిన ఆ పిల్లవాడు ఆమె వదిలేసిన ప్లేటులో మిగిలిన ఆహారాన్ని తినబోతుంటాడు. అయితే ఆ పిల్లాడిని చూసిన వెయిటర్ ఆ అబ్బాయి వద్దకు వచ్చి, ప్లేటును తీసుకొని వెళ్తాడు.
అప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన అక్కడివారు జాలిపడతారు. ఇంతలో ఆ అబ్బాయి తింటున్న ప్లేటును తీసుకెళ్లిన వెయిటర్, వేరే ప్లేటులో మంచి ఫుడ్ ను ఆ అబ్బాయి కోసం తీసుకొచ్చి, టేబుల్ పై పెడతాడు. ఆ అబ్బాయి సంకోచిస్తాడు. అప్పుడు ఆ వెయిటర్ అతడి పై చేయి వేసి, తినమని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషించి ఆహారాన్ని ఇష్టంగా తింటాడు.
Ads
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో పై రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ‘ఇదంతా స్కిప్టెడ్ మాదిరి ఉందే’ అని కామెంట్స్ చేయగా, మరి కొందరు, ‘‘వెయిటర్ గ్రేట్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 4 వ తేదీన పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
The heroic waiter takes the leftover food from a small child and brings a new onepic.twitter.com/KVc2b9iEmn
— Enezator (@Enezator) November 3, 2023
Also Read: అదృష్టం అంటే ఇదే అనుకుంటా…తలపైనే చావును పెట్టుకుని 11 కిలోమీటర్లు బండిని నడిపాడు..చివరకి.?