Ads
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్రమంగా స్టార్స్ అయిన నటీనటులు ఎందరో ఉన్నారు. శ్రీదేవి దగ్గర నుంచి మీనా వరకు…. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మహేష్ బాబు వరకు.. చాలామంది చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై…ఆ తర్వాత క్రమంగా అంచలంచలుగా అగ్ర నటులుగా మారారు.
ఇదే తరహాలో ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన బబ్లూ…రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాను ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నానో కూడా అతను ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకీ ఈ బబ్లూ ఎవరు అంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు హీరోగా బూస్ట్ ఇచ్చిన ఆర్య చిత్రంలో అతని స్నేహితుడిగా నటించిన కుర్రాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెరపై కూడా బాగా పాపులర్ అయ్యాడు.
Ads
అయితే సడన్గా సినిమాలకు అతను దూరమయ్యాడు. ఇదిగో ఇంత కాలానికి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెరిశాడు. తన జీవితంలో జరిగిన కొన్ని విషాద ఘటనల కారణంగా అతను డిప్రెషన్ లోకి వెళ్లినట్టు బబ్లూ పేర్కొన్నాడు. 2012లో అతని తండ్రి మరణం…తరువాత సరిగ్గా 10 సంవత్సరాలకు 2022లో చెల్లెలు చనిపోవడం., తర్వాత సంవత్సరంలోపే తన మేనత్త కొడుకు దూరం కావడం…ఇలా తనకు ఎంతో దగ్గర అయిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి తనని వదిలి వెళ్ళిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక అతను డిప్రెషన్ లోకి వెళ్ళాడు.
ఇక ఇక్కడ ఉండలేక బ్యాంకాక్ లో డీజే గా పని చేస్తూ…ఒక ఫిలిం అకాడమీలో ఫ్యాకల్టీ గా ఉన్నాడు. అయితే త్వరలోనే అతను సినిమాల్లోకి తిరిగి రాబోతున్నట్లు తెలియజేశాడు. సదానంద…అలియాస్ బబ్లూ 5 ఏళ్ల వయసులో ముద్దుల మేనల్లుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత బుల్లితెరపై ఏనో సీరియల్స్ లో నటించాడు. ఉదయ్ కిరణ్ చిత్రం మూవీ లో చేసిన తర్వాత బబ్లూ కు అవకాశాలు క్యూకట్టాయి. అయితే ఆన్ స్క్రీన్ ఎప్పుడు అందర్నీ నవ్విస్తూ ఉండే బబ్లూ జీవితంలో ఇంత విషాదం దాగి ఉంది అన్న విషయం మొదటిసారి అతని ఇంటర్వ్యూ తర్వాతే తెలిసింది.
watch video: