Ads
భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. అలాగే మనుషులు కూడా ఏదో ఒక సమయంలో సందర్భంలో అనేక కారణాల వల్ల మరణిస్తూ ఉంటారు. భూమిపై ఎవరూ కూడా శాశ్వతం కాదు. అయితే మామూలుగా మన పెద్దలు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు. చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు అని చెబుతూ ఉంటారు.
గరుడ పురాణంలో ఆ స్వర్గం నరకం గురించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అందులో మనుషుల జీవన విధానం, ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం, తపస్సు లాంటి ఎన్నో విషయాల గురించి వివరించబడ్డాయి. అనగా చనిపోయిన వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. ఎలా ప్రయాణిస్తుంది. లేదంటే ఆత్మ భూమి మీదే ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గరుడ పురాణంలో మనిషి చేసిన పనులను బట్టి స్వర్గం నరకానికి వెళ్లే దారుల గురించి ప్రస్తావించబడింది. అలాగే మనిషి బ్రతికి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న వివరాలను కూడా స్పష్టంగా వివరించారు. అయితే అందులో స్వర్గం నరకం అన్న వాటికి ఖచ్చితమైన ఆధారాలు అనేవి ఏమీ లేవు. భగవద్గీతలో కృష్ణుడు ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు.
ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకుని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది. ఐదు మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది అని తెలిపారు. అలాగే గరుడ పురాణంలో మొత్తం 84 లక్షలకు పైగా నరకాలు ఉన్నాయని వాటిలో 21 నరకాలు మాత్రమే చాలా ముఖ్యమైనవి అని చెప్పబడ్డాయి.
Ads
మనుషులు బతికి ఉన్నప్పుడు భూమిపై ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారట. మతానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల ఆత్మలు కూడా నరక లోకానికే వెళ్తాయి. మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు. అంతవరకూ వారిని నపుంసకులు ఇబ్బందులు పెడుతూనే ఉంటారట. అలాగే మనిషి చనిపోయిన తరువాత గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం యమకింకరులు వచ్చి ఆ చనిపోయిన ఆత్మను తీసుకువెళ్లి మంచి చెడుల గురించి చెబుతారట.
ఆ తర్వాత 24 గంటల తర్వాత మళ్లీ ఆ ఆత్మను చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోతారట. అప్పుడు ఆ ఆత్మ ఎవరికి కనిపించదు ఆ ఆత్మ మాటలు కూడా ఎవరికి వినిపించవు. కానీ ఆత్మ మాత్రం అందరిని పిలవడానికి మాట్లాడడానికి పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేస్తూ ఉంటుందట. అప్పుడు తన కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తున్నప్పుడు తన చేసిన పాప పుణ్యములను తలుచుకొని ఆ ఆత్మ కూడా ఏడుస్తూ ఉంటుందట.
అయితే యమకింకరులు ఆత్మను కింద వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ ఆత్మకు లోకానికి దారి తెలియదు. ఇక 11 రోజులు 12 రోజులు పిండ ప్రధాన కార్యక్రమాలు అన్ని చేసే వరకు ఆ ఆత్మ వారితోనే ఉంటుందట. ఇక 12 రోజుల తర్వాత ఆ ఆత్మకు యమలోకానికి వెళ్లడానికి కావలసిన శక్తి మార్గం రెండు తెలుస్తాయని. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి ఒక్క ఆత్మ యమలోకానికి 12 నెలలు అనగా సంవత్సరం సమయం పడుతుందట. అయితే మనిషి బతికున్నప్పుడు ఎన్ని పాపా పుణ్యాలు చేశారో అన్నింటిని అనుభవించిన తర్వాతే స్వర్గానికి వెళ్తారట. ఎక్కువగా పుణ్యాలు మంచి మంచి పనులు దానధర్మాలు చేసిన వారిని 12 రోజుల తర్వాత యముకింకరులు వచ్చి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తాయట.