వాట్సాప్‌ చాట్‌ ఇతరులకు కనిపించకూడదా..? అయితే ఈ ఫీచర్ ని చూడండి..!

Ads

వాట్సాప్ ని ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా మంది వాట్సాప్ ని వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా ఈజీగా ఫొటోస్ ని పంపించుకోవచ్చు అలానే ఫైల్స్, వీడియోస్ మొదలైన వాటిని కూడా సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఎన్ని మెసేజింగ్ యాప్లు వచ్చినా కూడా వాట్సాప్ క్రేజ్ తగ్గక పోవడానికి కారణం యూజర్ల ప్రైవసీ కి వాట్సాప్ పెద్దపీట వేయడమే.

పైగా యూజర్ల అవసరాలకి అనుకూలంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ఫీచర్స్ అన్నీ కూడా యూజర్ల అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని వాట్సాప్ తీసుకొస్తుంది తాజాగా ఇంకో సూపర్ ఫీచర్ ని వాట్సాప్ తీసుకొచ్చింది. ప్రైవసీ కి ప్రాధాన్యతను ఇస్తూ ఈ ఫీచర్ ని తీసుకొచ్చారు.

ఇక ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. లాక్‌చాట్ అనే పేరు తో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ ని తీసుకు రావడం జరిగింది. ఈ ఫీచర్ సోమవారం రాత్రి నుంచి అందుబాటు లో వుంది. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించడం జరిగింది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది..?

Ads

దీని ఉపయోగం ఏమిటి అనేది చూస్తే.. యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను మరొకరికి కనపడకుండా చెయ్యచ్చు. ఒకరి తో చేసే చాట్ కన్వర్జేషన్‌ ఎవరికీ కనిపించకుండా ఉంచాలంటే ఈ ఫీచర్ ని వాడచ్చు.
మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ ని పాస్‌వర్డ్‌ లేదా ఫింబర్‌ ప్రింట్‌ తో ప్రొటెక్ట్ చెయ్యవచ్చు.

అదే కాక మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ చాట్ బాక్స్‌ లో కూడా కనపడదు. ఇవే కాదు కాంటాక్ట్ నుంచి మెసేజ్‌ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్‌ లో ఆ మెసేజ్‌ రాదు. ఇలా ఈ కొత్త ఫీచర్‌ తో చాట్ ని హైడ్ చెయ్యవచ్చు. ఈ అప్డేట్ కి సంబంధించి మెటా ఒక వీడియోను కూడా విడదుల చేసింది. ఆ వీడియో తో ఫీచర్స్ ని తెలిపారు.

Watch video:

Previous articleశివాలయంలో ప్రదక్షిణాలు ఎలా చెయ్యాలి..? చాలా మంది చేసే తప్పు ఇదే..!
Next articleఆర్మీ సైనికులు జుట్టుని ఎందుకు కత్తిరించుకోవాలి..? కారణం ఏమిటి..?