Ads
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అవ్వటం ఖాయం. కాంట్రవర్సీ అవుతుంది అనటం కన్నా అతను సిట్యుయేషన్ ని కాంట్రవర్సీ చేయటంలో ముందు ఉంటాడు ఆర్జీవి. ఇక ఆర్జీవి అమ్మాయిలతో ప్రవర్తించే తీరు గురించి చెప్పనవసరమే లేదు. పైగా చేసిన పనిని సమర్థించుకుంటూ తనని తాను గొప్పవాడిగా అభివర్ణించుకుంటాడు. ఎవరైనా అతనిని తప్పుపడుతూ మాట్లాడినా నా ఇష్టం నాకు నచ్చినట్లు ఉంటాను నచ్చితే చూడండి అంటూ మొండిగా మాట్లాడటం అతని నైజం.
అతనిని విమర్శించిన ఆడవాళ్ళని సైతం తలదించుకునేలా మాట్లాడటం అతనికే చెల్లింది. అలాంటి విచ్చలవిడతనానికి అలవాటు పడిన ఆర్జీవి మొన్నటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటాడో అంటూ చాలామంది ఎదురు చూశారు. ఎందుకంటే ఏదో ఒక అకేషన్ కి ఏదో ఒక పార్టీలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాటిని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఆయనకి అలవాటే.
Ads
అలా ఫేమస్ అయిన వాళ్లే ఆషూ రెడ్డి, ఇనయాసుల్తానా, అరియానా.ఇక ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు మరొక కొత్త అమ్మాయి తో పార్టీలో చిందులు వేస్తూ ఆ అమ్మాయిని ఫేమస్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో అంటూ తెగ సెర్చింగులు చేస్తున్నారు నెటిజెన్స్. ఆ ఫోటోలని వీడియోలని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా అంటూ ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా పేజ్ ని కూడా ట్యాగ్ చేసి వదిలిపెట్టాడు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే పేరు సిరి స్టేజి. ఆల్రెడీ ఈ అమ్మాయి గతంలో ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది. మొదటిసారి అప్పుడే ఫేమస్ అయింది ఈ అమ్మాయి. మళ్లీ ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ పాపులారిటీ ఆమెకి ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి మరి