Ads
వన్డే ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదు అయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై ఆస్ట్రేలియా గెలుపు సాధించింది. ఇది కొత్తేమీ కాదు. కానీ ఆస్ట్రేలియా గెలిచిన విధానం అద్భుతం. మ్యాడ్ మ్యాక్సీ… ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు ఒక ట్రెండింగ్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్ కి చేర్చిన మొనగాడు మాక్సీ…2023 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాకి ఆఫ్గనిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 50 ఒవర్స్ కి 291 పరుగులు చేసింది.
తర్వాత 292 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి దిగింది. ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ అంతా వరుస పెట్టి వికెట్లు కోల్పోతూ కుప్పకూలింది. 91 పరుగులు వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇక వెంటనే ఆల్ అవుట్ అయిపోతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అక్కడ క్రీస్ లో ఉంది ఎవరో తెలుసు కదా…ఆస్ట్రేలియన్ హార్ట్ హిట్టర్ మాక్స్ వెల్.
అతని ఆట తీరు చూసిన ఎవరికైనా సరే అమ్మోరు గాని పూనిందా అనుకోకమానరు. 200 పరుగులు చేసి 2023 ప్రపంచ కప్ లో ఒక రికార్డు అయితే సృష్టించాడు. మాక్స్ వెల్ బ్యాటింగ్ చూసిన ఎవరైనా కూడా ఏంటి బాదుడు, ఏంటి విధ్వంసం అంటారు. గాయం బాధిస్తున్నా, నొప్పిని భరిస్తూ, పోరాడి ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
Ads
147వ రన్ వద్ద 35వ సింగల్ తీస్తున్న సమయంలో అతనికి ఉన్నట్లుండి హామ్‌స్ట్రింగ్ నొప్పి మొదలైంది. ఆ నొప్పి వల్ల పరుగులు తియ్యలేక మైదానంలోనే పడిపోయాడు. ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్ట్ వచ్చి అతనికి రిలీఫ్ ఇచ్చే విధంగా చేసినా. అతను నొప్పిని భరిస్తూనే ఆడాడు. అతని స్థానంలో క్రీజ్ లోకి రావడానికి ఆడమ్ జంపా సిద్ధం అయినప్పటికీ.. మ్యాక్స్ ‘రిటైర్డ్ హర్ట్’గా వెళ్ళడానికి ఒప్పుకోలేదు.
అయితే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ ఏంటంటే.. నొప్పితో బాధపతున్నా మాక్స్వెల్ బై రన్నర్ ని ఎందుకు పెట్టుకోలేదు ? దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? రిటైర్డ్ హర్ట్ తీసుకోలేదు అంటే టీం ని గెలిపించడానికి అనుకోవచ్చు. కానీ రన్నర్ ని ఎందుకు పెట్టుకోలేదు. ఐసీసీ 2011 లోనే ఈ వెసులుబాటుని గతంలోనే ఎత్తేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
వాటి ప్రకారం గాయాల పాలైన, హెల్త్ పరంగా ఇబ్బంది ఎదురైనా బై రన్నర్ ను పెట్టుకునే అవకాశం ఉండదు. ఫీల్డింగ్ కి రన్నర్ వల్ల ఇబ్బంది అవుతుంది అని ఐసీసీ రన్నర్ ని పెట్టుకునే రూల్ ని తీసేసింది అంట. అప్పుడు చాలామంది ప్లేయర్స్ ఒప్పుకోలేదు అంట. కానీ ఇంజురీ ఉన్నప్పుడు రిటైర్డ్ హర్ట్ తీసుకొచ్చుగా రన్నర్ ఎందుకు అని వాదించి ఆ వెసులుబాటుని తీసేసింది అంట.