Ads
ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరో తమ అభిమానులకు చేరువ అయ్యే విధంగా తమ సినిమాలు చేసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. వారితో మనసు విప్పి మాట్లాడడం వారితో తమ వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు తమ అభిమానులనే తమ బలంగా భావిస్తూ ఉంటారు. అయితే మన హీరోలు స్టేజ్ మీద ఓపెన్ అయి మాట్లాడుతుంటే చాలామంది ఏడుస్తున్నారు…
అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించారు. ఆ బాధనంతా అభిమానులు సమక్షంలో పంచుకొని కన్నీరు మున్నీరయ్యారు. తన అభిమానులే తనకు మద్దతుగా నిలబడ్డారని బహిరంగంగా చెప్పారు. అలానే అలా వైకుంఠపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ అయ్యారు. పక్కనే ఉన్న తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ తన తండ్రి లేకపోతే తాను లేనని తన తండ్రి తనకి గొప్ప అంటూ చెప్పుకున్నారు.
Ads
తాజాగా గుంటూరులో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తన 25 ఏళ్ల సినీకెరీలో తనకి అండగా నిలబడ్డ అభిమానులందరికీ చేతులెత్తి నమస్కారం చేశారు. తనకి తల్లి తండ్రి లేరని అభిమానులే తనకి తల్లిదండ్రులతో సమానం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇది చూసి మహేష్ అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యి మహేష్ కి మద్దతు తెలిపారు.
అయితే కొందరు సోషల్ మీడియా పండితులు వీటి పైన కూడా కామెంట్లు చేస్తున్నారు. సింపతి కోసం ట్రై చేస్తున్నారు సినిమా హిట్ అవ్వాలని స్టంట్ లు చేస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్ అవడం కోసం మన హీరోలు ఇంతలా అభిమానుల ముందు ఎమోషనల్ అవ్వాల్సిన పనిలేదు. చాలా సినిమాలు కనీసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా కూడా సూపర్ హిట్ అయ్యాయి.
హీరోలు ఏ ఈవెంట్ చేసిన తమ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేస్తారు. తమ అండగా నిలబడ్డ అభిమానులు గురించి మాట్లాడుతూ ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతారు. పైన చెప్పిన సందర్భాలు అన్నీ కూడా అలా జరిగినదే. దీనిపైన కూడా పెడ అర్థాలు తీసే విమర్శకులకు ఆ హీరోల అభిమానులే సరైన బుద్ధి చెబుతున్నారు.