Ads
బాలీవుడ్ నటుడు, దర్శక రచయిత్ మహేష్ మంజ్రేకర్ కూతురు సాయీ మంజ్రేకర్ గురించి మనందరికీ తెలిసిందే. తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో మంచి బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయీ మంజ్రేకర్ పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ తో అయితే ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సిరీస్‌లో.
సాయీ పర్ఫార్మెన్స్ సో సోగా ఉన్నా సల్మాన్ ఖాన్ పేరు మీద సినిమా హిట్ అయింది. నిజంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మర్ అని మాత్రం చెప్పుకోలేరు. టాలీవుడ్ లో కూడా ఒక రెండు మూడు సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత సాయీ మంజ్రేకర్ కి అత్యంత సన్నిహితురాలు.
Ads
కాబట్టి మహేశ్ నిర్మాణంలో వచ్చిన మేజర్ సినిమాలో, వరుణ్ తేజ్ నటించిన ఘని సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే, వీటిలో మేజర్ ఒక మాదిరిగా ఆడింది. ఘనీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ రెండు సినిమాలలో సాయీ మంజ్రేకర్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. శ్రీలీల మాదిరిగా హీటెక్కించే డాన్సులు కైపెక్కించే రొమాంటిక్స్ సీన్స్ చేసిందీ లేదు. దాంతో మనకి సాయీ మంజ్రేజర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టాలీవుడ్ మేకర్స్ దూరం పెట్టారు.
అయినా బోయపాటి శ్రీను ఏదో చూపిద్దామని శ్రీలీల ఉన్నా కూడా సాయీ మంజ్రేకర్ కి స్కంద సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. సినిమా ప్లాప్ అవ్వడంతో శ్రీలీల గురించే ఎవరూ మాట్లాడుకోలేదు. ఇక సాయీ సంగతి సరేసరి. దీంతో ఈ ముద్దుగుమ్మ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. అందం ఒకటే ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి అంటూ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.