Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కున్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా, నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ బిజీలో ఉన్న అల్లు అర్జున్ మెసేజ్ అంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ ఒక అమ్మయికి ఇన్ స్టాగ్రామ్ లో మెసెజ్ చేసాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో కరోలిన్ షెక్స్ పేరుతో ఒక ఖాతా ఉంది. ఆమె ఫారెన్ అమ్మాయిలా కనిపిస్తోంది. ఆ అమ్మాయి ఫోటోలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె చాలా క్యూట్‌గా ఉందని కొందరు, ఆమె హెయిర్ స్టైల్ బాగుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. కరోలిన్ షెక్స్ ఖాతాకు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు.
అయితే ఆమెకి అల్లు అర్జున్ పర్సనల్‌గా మెసెజ్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ మెసేజ్ చూసి తనకు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ మెసెజ్ చేశాడని, ఆ మెసెజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ సంబరపడిపోతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. వాటిలో “మీ పోస్టులు చాలా క్యూట్‌గా, ఫన్నీగా ఉన్నాయి. గాడ్ బ్లెస్, కీప్ షేరింగ్” అని మెసెజ్ చేసినట్లుగా ఉంది.
Ads
అల్లు అర్జున్ తనకు మెసెజ్ చేశాడని, ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి సంతోషపడ్డట్టుగా కూడా స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి. వీటిని చూసిన నెటిజెన్లు అల్లు అర్జున్ మెసెజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ అసలు ఆ అమ్మాయికి ఎందుకు మెసెజ్ చేశాడు అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు.
కానీ అది ఒరిజినల్ కాదు అని తెలిసింది. ఈ సంఘటన ఇటీవల జరిగింది. ఇది ఒక్కటి మాత్రమే కాదు. అల్లు అర్జున్ విషయంలో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఎవరికీ అర్థం కాని విషయం. మిగిలిన హీరోల మీద కూడా ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ అల్లు అర్జున్ మీద మాత్రం అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి దీనికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు.
Also Read: “My Name Is Shruthi” REVIEW: హన్సిక నటించిన ఈ కొత్త సినిమా ఎలా ఉంది..? స్టోరీ రివ్యూ & రేటింగ్..!