Ads
తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భారతీయులు నిరాశ పడడంతో పాటు చాలామంది ఎమోషనల్ కూడా అయ్యారు. ఒక టీమ్ ఇండియా ఓటమి పట్ల పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ బాధను వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో టీమిండియా ఓటమికి బిజెపికి సంబంధం ఉంది అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే. 2011 తర్వాత ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఇంకా చెప్పాలి అంటే 2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015లో వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2021లో టీ20 ప్రపంచ కప్ లీగ్ దశ, 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2023 ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, తాజాగా 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది.
Ads
బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఎన్నో మ్యాచ్ లలో మన జట్టు ఓడిపోయింది. ఎందుకు పరోక్షంగా బిజెపి నే కారణం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలంటూ కొందరు నెటిజన్లు కావాలని టార్గెట్ చేసి కామెంట్ పెడుతున్నారు. 2014 నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు క్రికెట్ కి పాలిటిక్స్ కి సంభందం ఏంటి.? ఎందుకు ఇలా లింక్ చేసి ఒక పొలిటికల్ పార్టీని ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా ఎవరు అని, అమిత్ షా తనయుడు కాబట్టే బీసీసీఐలో పాలి ట్రిక్స్ నడుస్తున్నాయని టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు.
అసలు ఫైనల్ అహ్మదాబాద్లో పెట్టడం అవివేకం అని దీనికి బీజేపీ ప్రభుత్వ అత్యుత్సాహమే కారణమని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని వాటిని గౌరవించాలని హితవు పలుకుతున్నారు. సెంటిమెంట్లు ఉంటాయి నిజమే..కానీ కొంచెం వివేకంతో ఆలోచించాలిగా.? మొత్తంగా టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు విశ్వసించగా చివరకు వాళ్లకు నిరాశే మిగిలింది. అయితే ఎక్కువ శాతం నెటిజన్స్ మాత్రం “ఎప్పుడు లేనిది పాలిటిక్స్ కి క్రీడలకు మధ్య సంబంధం ఏంటి ఇవన్నీ జస్ట్ ట్రోల్స్ మాత్రమే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.